Site icon NTV Telugu

V.Hanumantha Rao : రాజగోపాల్‌ రెడ్డి పోతా అని అంటుంటే… ఆయన దగ్గరికి పోయి నేనేం చేయాలి

V Hanumantha Rao

V Hanumantha Rao

Congress Party Senior Leader V.Hanumantha Rao about MLA Komatireddy Rajgopal Reddy Issue.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేరేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో కాంగ్రెస్‌ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్‌ నాయకులు వి.హనుమంత రావును రంగంలోకి దింపింది. అయితే కాంగ్రెస్‌ పార్టీలో నాకు ఘోర అవమానం జరిగిందని, ఇక పార్టీలో ఉండనని రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వి.హనుమంతరావు మాట్లాడుతూ.. అజాధి కా అమృత్ మహోత్సవం అని బీజేపీ అంటుంది కానీ.. జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య నీ మర్చిపోయారని ఆయన విమర్శించారు. ఆగస్ట్ 2న పింగళి వెంకయ్య పుట్టిన రోజున కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి…కి లేఖ రాసిన కానీ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. జెండా తయారు చేసిన తెలుగు వాడికి గౌరవం లేకుంటే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు.

 

పింగళి వెంకయ్యకి గుర్తింపు లేకుంటే ఇంకేముందని, ఎవరెవరికి ఉత్సవాలు చేస్తారు… జెండా రూపొందించిన వ్యక్తి కి గుర్తింపు లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్యను గౌరవించాలని.. అయన వారసులకు కూడా గౌరవం దక్కాలన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ పరిస్థితి బాగోలేదు అని దిగ్విజయ్ సింగ్ కి రాజగోపాల్ రెడ్డి చెప్పారట, బీజేపీ లోకి పోవాలని డిసైడ్ అయ్యాడని, పార్టీ లో ఆయనకు గుర్తింపు లేదు అని అంటున్నాడని ఆయన తెలిపారు. ఒరిజినల్ కాంగ్రెస్ లో వాళ్లకు అన్యాయం జరిగింది అని చెప్పాడని, అందుకే నా దారి నేను చూసుకుంటా అన్నాడంటూ హనుమంతరావు వెల్లడించారు. పోతా అని అయన అంటుంటే… అయన దగ్గరికి పోయి నేనేం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

 

Exit mobile version