ఫ్రొఫెసర్ల వేధింపులతో ఓ జూనియర్ డాక్టర్ నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న జూనియర్ డాక్టర్ దివేష్ గార్గ్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. ఒక ప్రొఫెసర్ తన కొడుకు థీసిస్‌ను రెండుసార్లు తిరస్కరించాడని.. ప్రొఫెసర్లు నిరంతరం వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
డెహ్రాడూన్‌లోని శ్రీ గురురామ్ రాయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సైన్సెస్‌లో డాక్టర్ దివేష్ గార్గ్ (26) పీడియాట్రిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మే 17న తన హాస్టల్ గదిలో శవమై కనిపించాడు. ఈ ఘటనలో డాక్టర్ ఉత్కర్ష్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గార్గ్ మరణానికి సంబంధించి IPC సెక్షన్ 306 కింద పీడియాట్రిక్స్ విభాగం అధిపతి శర్మ, ప్రొఫెసర్లు ఆశిష్ సేథి, బిందు అగర్వాల్ పై కేసు నమోదు చేశారు.
Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?
తన కొడుకు అక్టోబర్ 2023లో కాలేజీలో చేరాడని.. కొన్ని రోజుల తర్వాత ఉత్కర్ష్ శర్మ, ఆశిష్ సేథీ, బిందు అగర్వాల్ మరియు మేనేజ్‌మెంట్ కమిటీ తన కొడుకును వేధించడం మొదలుపెట్టారని మృతుడి తండ్రి తెలిపాడు. 104-డిగ్రీల జ్వరంతో ఉన్న కూడా అతనిని 36 గంటల షిఫ్ట్‌లలో పని చేసేలా చేసారన్నాడు. ఆ విషయం తన కొడుకు తనతో చెప్పాడని తెలిపాడు. అంతేకాకుండా.. ఉత్కర్ష్ శర్మ తన థీసిస్‌ని రెండుసార్లు తిరస్కరించాడని, ఉత్తీర్ణత కోసం 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని.. బిందు అగర్వాల్ తన కొడుకును మానసికంగా వేధించిందని మృతుడి తండ్రి ఆరోపించాడు
అయితే.. మే 17న ఉదయం 10 గంటలకు తన కొడుకు ఫోన్ చేసినట్లు తండ్రి చెప్పాడు. ‘నన్ను తీసుకెళ్లండి, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను’ అని చెప్పాడన్నాడు. అయితే.. తాము మరుసటి రోజు తనను తీసుకురావడానికి వస్తామని, ఏమీ చేసుకోవద్దని చేప్పినట్లు తండ్రి చెప్పాడు. కానీ.. అదే రోజు రాత్రి తనకు కాల్ వచ్చిందని.. ఉత్కర్ష్ శర్మ అనే వ్యక్తి తన కొడుకును ఎమర్జెన్సీ వార్డులో చేర్చారని రమేష్ గార్గ్ చెప్పాడన్నాడు. రాత్రి 10:40 గంటలకు, తన కొడుకు మృతదేహం మార్చురీలో ఉందని మరో కాల్ వచ్చిందని తెలిపాడు. తన కొడుకు మరణం కుట్ర కోణమేనని తండ్రి ఆరోపించాడు.
