Site icon NTV Telugu

Hotel Room: హోటల్ రూం ఇవ్వనందుకు కాళ్లతో తన్నుతూ.. బీభత్సం

Hotel Room

Hotel Room

Hotel Room: ఉత్తరప్రదేశ్‌లో ఓ గ్యాంగ్ రెచ్చిపోయింది. హోటల్ రూం ఇవ్వనందుకు సిబ్బందిపై రెచ్చిపోయారు. మద్యం బాటిళ్లతో ఓ గ్యాంగ్ బిజ్నూర్‌లోని హోటల్‌ రిసెప్షన్‌ దగ్గరకు వచ్చింది. ఓ రూమ్‌ కావాలని అడిగింది. అయితే, రూమ్స్‌ ఖాళీగా లేవని సిబ్బంది చెప్పారు. దీంతో తమకు కచ్చితంగా రూమ్ కావాల్సిందేనంటూ పట్టుబట్టారు. మేనేజర్ రూమ్‌లు లేవని మరోసారి చెప్పాడు. జీర్ణించుకోలేని వారు హోటల్‌ యజమానితో వాగ్వాదానికి దిగారు. యజమానితో పాటు సిబ్బందిపై అటాక్‌ చేశారు.
Read Also: Cabinet meeting: ముగిసిన కేబినెట్ భేటీ.. బడ్జెట్ కు ఆమోదం
లోపలికి ప్రవేశించి విచక్షణారహితంగా కాలితో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ మేనేజర్ సహా, సిబ్బందిపై దాడి చేశారు. ఈ దృశ్యాలు హోటల్‌ సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఓనర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటుచేశారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెబుతున్నారు బిజ్నూర్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు. మేనేజర్ వారికి గది ఇవ్వడానికి నిరాకరించడంతో దాడికి దిగినట్లు ఎస్పీ ప్రవీణ్ రంజన్ సింగ్ తెలిపారు.

Exit mobile version