ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీప్రసంగం అట్టర్ ప్లాప్ అయ్యిందని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలను నిరుత్సాహ పరిచే విధంగా సభ సాగిందంటూ విమర్శలు గుప్పించారు. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వైఖరి ఉందని వ్యాఖ్యానించారు. రెండు పార్టీలు దొందూ దొందే అనడానికి నిన్న జరిగిన సభే నిర్వచనమన్నారు.
Jaggareddy: సంచలన నిర్ణయానికి టైం ఉంది.. అది కూడా పార్టీ మంచి కోసమే..
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగితే ఈడీతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు తధ్యం… అందుకు అంతా సిద్ధం కావాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సభలో రాష్ట్ర అభివృద్ధి గురించే ప్రసంగించలేదని ఆయన విమర్శించారు.