NTV Telugu Site icon

Uttam Kumar Reddy: రాష్ట్రంలో రాజకీయ నిశ్శబ్ద విప్లవం నడుస్తుంది..

Utham

Utham

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు అని విమర్శలు గుప్పించాడు. దేశంలోనే తెలంగాణ మద్యం ఎక్కువ తాగి.. అవినీతిలో అగ్ర స్థానంలో నిలిపారు అని ఆయన అన్నారు.

Read Also: R. Krishnaiah: బీసీలకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది..

తెలంగాణ ఎమ్మెల్యే లు దోపిడీకి అలవాటు పడి సాధారణ ప్రజలను హింసిస్తున్నారు అని కాంగ్రెస్ స్ర్కీనింగ్ కమిటీ‌ సభ్యుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేల దోపిడీ, వికృత చేష్టలకు విసిగిపోయిన ప్రజలు వాళ్ళను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిపాడు. నేను, నా భార్య పద్మావతి ఇద్దరం ఈ సారి పోటీలో ఉండబోతున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. మా ఇద్దరితో పాటు ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది.. రాష్ట్రంలో 70 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Read Also: German Minister: యూపీఐ పనితీరు చూసి ఆశ్చర్యపోయిన జర్మనీ మంత్రి

సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలను తుంగలో తొక్కాడు అని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ దోపిడీ దారులకు కేసీఆర్ వత్తాసు పలికినట్లుగా ఉంది.. దళిత బంధులో కమిషన్లు నొక్కిన ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టికెట్లు ఇవ్వడం సిగ్గుచేటు.. రాష్ట్రంలో రాజకీయ నిశ్శబ్ద విప్లవం నడుస్తుంది అని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశాడు.