NTV Telugu Site icon

Uttam Kumar Reddy : ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేశాం

Uttamkumar Reddy

Uttamkumar Reddy

ఈరోజు NDSA చైర్మన్, అధికారులతో మాట్లాడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న ఢిల్లీలో NDSA కమిటీతో సమావేశం ఉంటుందని, వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై చర్చించామన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. 18 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల ఇంట్రెస్ట్ కి పోతున్నవని, ఇరిగేషన్ పనుల కోసం మరో 11 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాలని ఆర్ధిక శాఖని కోరుతున్నామన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. 2025 డిసెంబర్ వరకు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, డిండి కూడా ప్లాన్ లో ఉందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Prank Goes Wrong: ప్రాంక్ ప్రాణాలు తీసింది.. మూడో అంతస్తు నుంచి పడి మహిళ మృతి.. వీడియో వైరల్..

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బడ్జెట్ కోసం పైనాన్స్ డిపార్ట్మెంట్ కి పంపుతున్నామని, సమ్మక్క ప్రాజెక్ట్ ల్యాండ్ కోసం ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బ్యారేజీకి సంబంధించిన ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై పలు అంశాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. భారీవర్షాలు పడితే ప్రాజెక్ట్‌లకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Amitabh Bachchan: ప్రభాస్ కి అది కొత్త ఏంకాదు అంటున్న బిగ్ బి