Site icon NTV Telugu

Uttamkumar Reddy : ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. సర్పంచులకు వెంటనే నిధులను విడుదల చేయాలి

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

సర్పంచుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. నిధులు విడుదల చేసి గ్రామాభివృద్ధి కి తోడ్పడాలన్నారు టీపీసీసీ మాజీ అధ్యక్షులు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేడు ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. అయితే.. ఈ ధర్నాకు పోలీసులు నిరాకరించడంతో.. ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్‌ ప్రకటించింది. దీంతో ఉదయం నుంచి కాంగ్రెస్‌ నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించడం దుర్మార్గమన్నారు. వెంటనే గ్రామాలకు నిధులు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను అడ్డుకోవడం అక్రమం.. అరెస్ట్ చేసిన నాయకులందరిని వెంటనే విడుదల చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్‌ చేశారు.
Also Read : Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌
రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందన్నారు. అంతేకాకుండా.. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల గురించి విడుదల చేయాల్సిన 250 కోట్ల రూపాయలు 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు వత్తిడి చేస్తున్నారని, చేసిన పనులకు నిధులు విడుదల చేయడం లేదన్నారు.

Also Read : Harish Rao : స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన హరీష్‌రావు
బిల్స్ చాలా పెండింగ్‌లో ఉండి, సర్పంచులు, ఉప సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అధికార పార్టీ సర్పంచులు, ఏక గ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ లు చాలా.మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, చేసిన పనులకు బిల్లులు రాక, గ్రామ పంచాయితీ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గ్రామాలలో పనులు చేయకపోతే అధికారులు సస్పెండ్ చేస్తామని సర్పంచులను బెదిరిస్తున్నారు.. చేసిన పనులకు బిల్స్ ఇవ్వడం లేదు. వచ్చిన కొద్దిపాటి నిధులను ట్రాక్టర్ ఈ.ఎం. ఐ లకు కట్ చేస్తున్నారు. ఇలా సర్పంచుల పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.. సర్పంచులకు వెంటనే నిధులను విడుదల చేయాలి.. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Exit mobile version