పార్లమెంట్ ఎన్నికలు దేశ.. మన కుటుంబాల భవిష్యత్తుకి కీలకమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థని ధ్వంసం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. కీలకమైన చట్టాలు.. ప్రతిపక్షాలను తొక్కేసి ఆమోదం పొందేవి అని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ప్రజలకు తెలియాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. మోడీ స్పీచ్‌లు చూస్తే.. ఇంత దిగజారి పోయారు అనిపిస్తుందని, స్టేట్స్ మెన్ లాగా ఉండాలి కానీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కి వస్తే ఏం చేశాం..ఏం చేస్తాం అనేది చెప్పాలని, కానీ ఇవేం చెప్పడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్.. విజయవాడ బుల్లెట్ ట్రైన్ కి అనుకూలం.. కానీ దాని ఊసేత్తడం లేదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే పని బీజేపీకి అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’బీఆర్‌ఎస్ గురించి ఎక్కువ మాట్లాడి వృధా.. 10 ఏళ్లు అవకాశం ఇస్తే.. దోపిడీ.. వికారపు మాటలతో ప్రజలకు దూరం అయ్యారు. 104 సీట్ల నుండి.. 39 కి పడిపోయారు.. ఉన్న ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. మేడిగడ్డ కూలింది అక్టోబర్ లో.. అప్పుడు సీఎం కేసీఆర్..
నీళ్లు వదిలింది వాళ్లు.. NDSA అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా గేట్లు ఎత్తి నీళ్లు వదిలి పెట్టండి అని చెప్పారు. మీరు కట్టిన బ్యారేజి కూలింది.. ముందు క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకుండా.. ఉచిత సలహాలు ఇవ్వకండి. వచ్చే పంట కి బోనస్ ఇస్తాం. మోడీ వచ్చినాక అగ్నివీర్ స్కీం పొరపాటు పెద్దది. 2 వేల కిలోమీటర్లు చైనా మన భూభాగాన్ని ఆక్రమించింది. మాజీ సైనికుడిగా.. జాతీయ భద్రతపై మోడీ ది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరం కమిటెడ్ టీం గా పని చేస్తున్నాం. ప్రభుత్వం ని కాపాడుకునే సత్తా ఉంది. మేము క్రికెట్ టీం లాగా కలిసి పని చేస్తున్నాం. ఐదేళ్లు సర్కార్ ఉంటుంది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
