Site icon NTV Telugu

రాష్ట్రంలో ఐఏఎస్‌,ఐపీఎస్‌ వ్యవస్థలను కేసీఆర్‌ ధ్వంసం చేశారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కేంద్రం ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థల తీరును కేసీఆర్‌ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్‌ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్‌ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్‌ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సోమేష్ కుమార్ కంటే సీనియర్ ఐఏఎస్‌లను కాదని సోమేష్‌ను ఎలా సీఎస్‌ చేశారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. సోమేష్ కుమార్ ఆంధ్ర క్యాడర్ అధికారి.. ఆయన మీద ఎందుకు అంత ప్రేమ అంటూ ఉత్తమ్‌ దుయ్యబట్టారు. రిటైర్డ్‌ అయినా డీజీపీ..రిటైర్డ్‌ అయినా సీఎస్‌లకు మళ్లీ పదవులు ఎందుకు ఇస్తున్నారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. క్యాడర్ అధికారులకు… నాన్ క్యాడర్..నాన్ క్యాడర్ వాళ్లకు క్యాడర్ పోస్టులు ఇస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ ఉత్తమ్‌ మండిపడ్డారు. 2016 క్యాడర్ ఐఏఎస్ లకు రెండేళ్లు పోస్టింగ్ ఇవ్వలేదని, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అని కేసీఆర్‌ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరి కేంద్రం ఇష్టం వచ్చినట్టు వాళ్లు చేసుకుంటున్నారని విమర్శించారు. మరి కేసీఆర్‌కు ఎందుకు ఇబ్బందని దుయ్యబట్టారు.

Read Also: ఉద్యోగాలు ఇవ్వకపోగా అరెస్టులు చేసి జైల్లో పెడతారా..?: రేవంత్‌ రెడ్డి

ఐఎస్‌, ఐపీఎస్‌లు తెలంగాణలో డిమోరల్‌ అయ్యారని ఆరోపించారు. వ్యవస్థను అంతా నిర్వీర్యం చేశారని ఉత్తమ్‌ అన్నారు. తెలంగాణ లో నలుగురు, ఐదుగురు ఐఎస్‌లకే అన్ని పదవులు, శాఖలు కట్టబెడుతున్నారని ఉత్తమ్‌ అన్నారు. ఎన్నికల్లో తనకు అనుకూలంగా చేశారు అని రజత్ కుమార్ కి ఇరిగేషన్ శాఖ బహుమతిగా ఇచ్చారన్నారు. 33 జిల్లాలో 20 జిల్లాలకు ఎస్పీలు నాన్‌ క్యాడర్‌ వాళ్లు… ప్రమోషన్‌ నుంచి వచ్చిన ఐపీఎస్‌లను ఎస్పీలు చేస్తున్నావ్‌.. అంటూ ధ్వజమెత్తారు. డైరెక్ట్ ఐపీఎస్‌లకు ఎస్పీ పోస్టింగ్‌ ఇవ్వడు అంటూ కేసీఆర్‌ను ఉత్తమ్‌ నిలదీశారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చలో కేసీఆర్‌ను నిలదీస్తామన్నారు. సూర్యాపేట కలెక్టర్‌గా పని చేసిన అమయ్‌కి రంగారెడ్డి జిల్లాను కానుకగా ఇచ్చారు. పేర్లతో సహా పార్లమెంట్లో ఈ అంశంపై ప్రస్తావిస్తా అని ఉత్తమ్‌ అన్నారు. ఫ్రెష్ ఐఏఎస్ లు వస్తే రెండేళ్ల వరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇంతమంది అధికారులు ఉంటే ఎందుకు పోస్టింగ్‌ ఇవ్వలేదని కోర్టుకు వెళ్తే ..ఇప్పుడు పోస్టింగ్ లు ఇస్తున్నారని ఉత్తమ్‌ అన్నారు.

Read Also: సీఎం కేసీఆర్‌పై కేసులు నమోదు చేయాలి: బండి సంజయ్‌

గతంలో కలెక్టర్‌, ఎస్పీ అంటే గౌరవం ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్యే లకు తొత్తులుగా మారిపోయారని ఉత్తమ్‌ విమర్శించారు. సీఎంకి సహకరించే అధికారులకు మాత్రమే పోస్టింగులు ఇస్తున్నారన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే కేసిఆర్‌కు .. ప్రోటోకాల్ తెలియదా..? నల్గొండకు వచ్చినప్పుడు ఎంపీకీ సమాచారం కూడా ఇవ్వరా..? ఇన్విటేషన్ కాకపోయినా..కనీసం ఇన్ఫర్మేషన్ ఉండదా..? నీకేమో గౌరవం ఉండాలి.. ఎదుటి వాళ్లకు గౌరవం ఉండొద్దా అంటూ ఉత్తమ్‌ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఎక్కువ కాలం ఇది నడవదు అంటూ ఉత్తమ్‌ కేసీఆర్‌ను హెచ్చరించారు. సీఎస్‌ సోమేష్… డిప్యూటీ సీఎం మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. అహంకారి సోమేష్‌ అని మండిపడ్డారు. కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వరూ.. అందరి సంగతి త్వరలో తేలుస్తా అని ఉత్తమ్‌ అన్నారు. ఐఎస్‌ అధికారులు బిల్డింగ్‌లు కూలగొడితే మాట్లాడే దిక్కు లేదు. విపరీత బుద్ధులు పోతాయి. ఐఎస్‌ అధికారుల సంఘం ఎందుకు స్పందించరూ… అంటూ ఉత్తమ్‌ ప్రశ్నించారు. దీనిపై ప్రజా స్వామ్య పద్ధతిలోనే పోరాటం చేస్తాం.. ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తాం అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

Exit mobile version