NTV Telugu Site icon

Uttam Kumar Reddy : 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం

Uttam Kumar On Budget

Uttam Kumar On Budget

నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో కాంగ్రెస్ నాయకులు బి.ఎల్.అర్ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హత్ జేడో యాత్రను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 2024లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. జాతి సంపదను అప్పనంగా కాజేస్తున్న ప్రధాని మోదీ అవినీతిని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీనీ పార్లమెంటులో అనర్హత వేటు వేశారని, 1975లో ఇందిరాగాంధీని పార్లమెంటు నుంచి బహిష్కరించిన జనత ప్రభుత్వానికి పట్టిన గతే బీజేపీ పడుతుందన్నారు. కేంద్రంలో బీజేపీ నామరూపల్లేకుండా పోతుందన్నారు. దేశ ప్రజల విద్వేషాలు వీడనాడి.. సద్భావంతో ఉండాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లు జోడో యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ జొడో పాదయాత్రకు సంఘీభావంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బిఎల్ ఆర్ చేపట్టిన జోడయాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Also Read : CM KCR : మహారాష్ట్రలో పోటీ చేస్తాం..

ఇదిలా ఉంటే.. ఖమ్మం వైరా లో హాత్‌ సే హాత్‌ జోడోయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాక్రే, మాజీ ఎంపీ రేణుకచౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రేణుక చౌదరి మాట్లాడుతూ.. ఖమ్మంలో బీజేపీకి చోటు లేదన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అడ్డా అని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి జిల్లాలో పది పదికి సీట్లు గెలుచుకుంటామని, మొదటి నుంచి ఖమ్మం కాంగ్రెస్ కు పట్టు ఉన్న జిల్లా అన్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఖమ్మం జిల్లాను కాపాడుకుంటానని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్త కు అండగా ఉంటానని, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీ అర్ ఎస్ పార్టీ లోకి వెళ్ళిన ఎమ్మేల్యే లను వదిలి పెట్టమన్నారు. తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఖమ్మం మంత్రి గుట్టల ను కు వదిలి పెట్టడం లేదన్నారు.

Also Read : Puvvada Ajay Kumar : ఖమ్మంలో ఎక్కడ చూసినా నేను చేసిన అభివృద్ధే కనిపిస్తోంది