Site icon NTV Telugu

Uttam Kumar Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకే హత్ సే హత్ జోడో యాత్ర

Uttam Kumar Redy

Uttam Kumar Redy

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకే రాహుల్ గాంధీ భారత్‌ జోడో పేరిట పాదయాత్ర చేపట్టారని, ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెలంగాణలో హత్ సే హత్ జోడో యాత్రను చేపట్టినట్లు టీపీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలకు నిరుద్యోగ సమస్యను ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు ఇంటింటికి కాంగ్రెస్ పోగ్రాం చేపట్టామన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రాల్లో వివిధ పార్టీలు దేశాన్ని విభజించి పాలించు అనే రీతిలో పరిపాలన చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Also Read : Real Story Behind Tech Companies Layoffs: టెక్‌ సంస్థలు స్టాఫ్‌ని నిజంగా ఎందుకు తీసేస్తున్నాయంటే..

అంతేకాకుండా.. కాంగ్రెస్ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు కోదాడకు ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ థాక్రే, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బోస్రాజుతో పాటు జిల్లా పార్లమెంటు కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర 150 రోజుల పాటు దిగ్విజయంగా దేశ చరిత్రలోనే పొలిటికల్ మూమెంట్ గా సాగిందన్నారు.

Also Read : YS Jagan Tenali Tour: రేపు తెనాలి పర్యటనకు సీఎం జగన్.. వారికి గుడ్‌న్యూస్‌

ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌స్తుతం కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పిలుపుమేర‌కు హాత్ సే హాత్ జోడో యాత్ర‌ను నిర్వ‌హిస్తున్న రేవంత్‌ రెడ్డి.. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్ అంటూ.. ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థిస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌గ‌తిని సాధిస్తామ‌ని.. ప్ర‌గ‌తిని చూపిస్తామ‌ని.. రేవంత్‌ పేర్కొంటున్నారు.

Exit mobile version