గత ప్రభుత్వం జిల్లాలను మండలాలను అశాస్త్రీయంగా విభజించిందని… దీని సరిచేయడానికి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్ ను ఏర్పాటు చేయబోతుందని స్పష్టం చేశారు నీటిపారుదల & సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు జిల్లా పరిషత్ పాఠశాల వజ్రోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి… పొనుగోడును మండలంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై స్పందిస్తూ…. ఆశాస్త్రీయంగా విభజించబడిన జిల్లాలను మండలాలను సరి చేసేందుకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓ కమిషన్ ను ఏర్పాటు చేయబోతుందని స్పష్టం చేశారు…. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కమిషన్… జిల్లాలో పర్యటించి ప్రజల నుండి సలహాలను, సూచనలను, విజ్ఞప్తులను స్వీకరిస్తుందని పేర్కొన్నారు… ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటిని తాగునీటి కోసం మాత్రమే వినియోగించుకునే పరిస్థితి ఉందని… తాగునీటి కొరకు మాత్రమే నాగార్జునసాగర్ నుండి నీటిని విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు త్వరలో 500 రూపాయలకే సిలిండర్ ను అందజేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం హుజూర్ నగర్ నియోజకవర్గం లోని లింగగిరి, కృష్ణ తండా గ్రామాలలో రూ౹౹ 20 లక్షల నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద,మధ్య తరగతి మహిళల్లో వెలుగులు నింపాలని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను త్వరలో అందజేయనున్నామని మంత్రి తెలిపారు.