Site icon NTV Telugu

Ustaad Bhagat Singh: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉస్తాద్ కొత్త పోస్టర్.. సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా తెరక్కెకుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా, ఇప్పుడు రెండో సింగిల్ రిలీజ్‌కు చిత్ర బృందం రెడీ అవుతుంది.

READ ALSO: Kamal Haasan: యువ హీరోతో మరో సినిమా నిర్మించబోతున్న లోకనాయకుడు!

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మరోసారి సంచలనం సృష్టించడాని సర్వం సిద్ధం చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ యాంథమ్ ఫిబ్రవరి 22న రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేస్తూ తాజాగా చిత్రం బృందం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిక్స్‌తో భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఎదురుగా అశేషమైన జన సముద్రం నులుచోని ఉంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, DSP మ్యూజిక్‌ అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

READ ALSO: Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!

Exit mobile version