NTV Telugu Site icon

Vote Ink Mark: మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్‌ మార్క్‌.. తొమ్మిదేళ్లు గడుస్తున్న చెరగని సిరా గుర్తు..

Usha Voter

Usha Voter

ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్‌కు వెళ్లే ప్రతి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై అధికారులు ఈ సిరా చుక్కను వేస్తారు. ఓటరు ఎన్నికల రోజున ఓటు వేసినట్లు నిర్ధారించడానికి, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా నిరోధించడానికి ఈ గుర్తు ఉపయోగించబడుతుంది. గోరుతో పాటు చర్మంపై వేసిన ఈ చుక్క సిరా వెంటనే తుడిపేయడానికి అంతసులువు కాదు. 15 – 30 సెకన్లలో ఆరిపోతుంది. అయితే, ఇది కొన్ని రోజులు మాత్రమే మన చేతి వేళ్లపై ఉంటుంది. ఇది 1 లేదా 2 నెలల్లో పూర్తిగా అదృశ్యమవుతుంది. కానీ ఒక మహిళకు, ఈ ఇన్క్ మరక సంవత్సరాలుగా పోలేదు. ఇప్పుడు అది ఆమెకు పెద్ద తలనొప్పి తెచ్చిపెడుతోంది.

Also read: ‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..

కేరళకు చెందిన ఉష అనే 62 ఏళ్ల మహిళ 2016లో ఓటు వేసింది. ఆ సమయంలో తన వేళ్లపై ఉన్న సిరా మరకలు చాలా రోజుల వరకు మాయమవ్వలేదు. అనేక రకాల సబ్బులు, ద్రావణాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ దెబ్బతో స్థానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించలేదు. అయితే, పోల్ వర్కర్ అతనికి నిజం చెప్పి చివరకు ఓటు వేయడానికి అనుమతించాడు.

Also read: Odisha: ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ మోడీ సవాల్.. సీఎం పట్నాయక్ రియాక్షన్..!

ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉష సిరా మరక కారణంగా ఓటు వేయలేదు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, ఆమె ఎడమ చూపుడు వేలుపై ఉన్న సిరా మరక ఇంకా అలాగే ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే సమస్య తలెత్తుతుందని ఉష అంటున్నారు. దీంతో ఆయన ఎన్నికల సిబ్బంది దృష్టిని ఆకర్షించారు. దింతో ఈ విషయం ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో వైరల్‌గా మారింది.