Site icon NTV Telugu

Joe Biden : జో బైడెన్ నే ఇబ్బంది పెట్టిన గొడుగు..

Joe Baiden

Joe Baiden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే అది పరిపాలన పరంగా అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఆయన చేసే పొరపాట్లు, తడబాట్ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి సంబంధించిన పలు వీడియోలో గతంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జో బైడెన్‌ మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Also Read : Asifabad: గేదెను కరిచిన కుక్క.. ఆసుపత్రి పాలైన 302 మంది

జపాన్ లో జరుగుతున్న.. జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ‍ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు. ఈలోగా అక్కడ ఉన్న జపాన్ ప్రతినిధులకు అభివాదం చేయడం.. అనంతరం ప్రతినిధులు ఒక్కొక్కరిగా తమను తాము బైడెన్‌కు పరిచయం చేసుకుంటున్నాట్లు మనం ఈ వీడియోలో చూడొచ్చు..

Also Read : Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో టర్నింగ్ పాయింట్.. కీలక నగరం రష్యా వశం..

ఈ క్రమంలో బైడెన్ వానలో తడుస్తూనే వారితో మాట్లాడుతుండటం మనం గమనించవచ్చు. ఇది చూసిన అమెరికా అధికారులు తమవద్ద ఉన్న గొడుగును పట్టే ప్రయత్నం చేస్తారు. అయితే బైడెన్ మరోసారి ప్రయత్నించడంతో చివరికి గొడుగు తెరుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రెండొంతుల మంది అమెరికన్లు తనకు రెండవసారి అవకాశం ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు నమ్ముతున్నట్లు పోల్స్‌ చెబుతున్నప్పటికీ బైడెన్‌ మాత్రం 2024లో తిరిగి ఎన్నిక కావాలనే ప్రణాళికలతో ముందుకు కదులుతున్నారు.

Exit mobile version