భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అయితే.. భారత్-కెనడా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రెండు దేశాలతో అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. వివాదం ముదిరడం ఆందోళనకరమని, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటామని వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జాక్ సుల్లివన్ అన్నారు. ఇదిలా ఉండగా, ఖలిస్తాన్ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి తమ వద్ద ఎలక్ట్రానిక్ ఆధారాలు ఉన్నాయని కెనడా పేర్కొంది. ఇంటెలిజెన్స్ సేవలు భారత ఏజెన్సీల ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు అందించాయని కెనడా అధికారి సూచించారు. సాక్ష్యం ఇప్పుడు బదిలీ చేయబడదని కెనడా వాదిస్తోంది.
Also Read : Ambati Rambabu: బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో.. బాలయ్య మీకు ఇదే సరైన సమయం..!
ఇదిలావుండగా, కెనడియన్ పౌరులకు భారతీయ వీసాల జారీని తదుపరి నోటీసు వచ్చేవరకు నిలిపివేసినట్లు ఒట్టావాలోని భారత హైకమిషన్ ధృవీకరించింది. కెనడాలోని భారత దౌత్య ప్రతినిధులకు బెదిరింపుల నేపథ్యంలో వీసా సేవలను నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడా కెనడియన్ పౌరులకు భారతీయ వీసాలు జారీ చేయబడవు. ఈ-వీసాతో సహా అన్ని రకాల వీసాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. భారత్‌లోని కెనడియన్ హైకమిషన్‌లోని మరింత మంది అధికారులు కూడా దేశం విడిచి వెళ్లాలని సూచించారు.
Also Read : Bigg Boss Telugu 7: ప్రశాంత్ ను పక్కన పెట్టేసిన రతికా..పవరాస్త్ర కోసం ప్రియాంక కష్టాలు..
