NTV Telugu Site icon

China: అమెరికా విదేశాంగ మంత్రితో జీ జిన్‌పింగ్ భేటీ.. ఇరుదేశాల సంబంధాలే లక్ష్యంగా చర్చలు

Blinken China Visit

Blinken China Visit

Blinken China Visit: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా బ్లింకెన్ ఈ రోజు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా సమావేశమయ్యారు. యూఎస్-చైనా సంబంధాలను మెరుగుపరచడంపై చర్చించారు. అమెరికా దౌత్యవేత్త దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో బీజింగ్‌లో రెండు రోజుల పర్యటనను ముగించారు.

Also Read: Nepal Floods: నేపాల్‌లో ప్రకృతి విధ్వంసం.. ముంచెత్తిన వరదలు, ఐదుగురు మృతి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాను సందర్శించిన మొదటి ఉన్నత స్థాయి యూఎస్ అధికారి బ్లింకెన్. ఐదేళ్లలో బీజింగ్‌లో పర్యటించిన తొలి అమెరికా విదేశాంగ మంత్రి కూడా ఆయనే. చైనా స్పై బెలూన్ కేసు కారణంగా యాత్ర ఆలస్యమైంది. గత సంవత్సరం బాలిలో జరిగిన సమావేశంలో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ త్వరలో బ్లింకెన్‌ను సందర్శించడానికి అంగీకరించారు. ఇది ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది కానీ అమెరికా ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు తెరపైకి రావడంతో ఆలస్యం అయింది.

Also Read: The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?

తాము పురోగతి సాధించామని, వివరించకుండానే కొన్ని నిర్దిష్ట సమస్యలపై ఒప్పందాలను కుదుర్చుకున్నామని జిన్‌పింగ్ చెప్పారు. చైనా-యూఎస్ బంధాన్ని స్థిరీకరించడానికి మరింత సానుకూల సహకారాలు అందిస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బ్లింకెన్‌ పర్యటన అమెరికా, చైనా అధికారుల కొత్త రౌండ్ సందర్శనలకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు, బహుశా రాబోయే నెలల్లో జిన్‌పింగ్, బైడెన్ మధ్య సమావేశం కూడా ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.