NTV Telugu Site icon

Modi US Tour: 300 పురాతన వస్తువులను ఇండియాకు తిరిగి ఇచ్చిన అమెరికా..

America Tour Modi

America Tour Modi

భారతదేశం నుండి అక్రమంగా తరలించబడిన అమూల్యమైన పురాతన వారసత్వాలను అమెరికా ఇండియాకు తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఈ 297 పురాతన వస్తువులను ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో.. 2014 నుండి భారతదేశం నుండి స్వాధీనం చేసుకున్న పురాతన వస్తువుల మొత్తం సంఖ్య 640కి పెరిగింది. ఒక్క అమెరికానే 578 వస్తువులను తిరిగి ఇచ్చింది. 2021లో అమెరికా ప్రభుత్వం 157 పురాతన వస్తువులను అందజేసింది. ఇందులో 12వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కాంస్య నటరాజ విగ్రహం కూడా ఉంది.

Read Also: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?

క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ.. భారత్‌కు చెందిన 297 పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక భారత్‌కు చెందిన పురాతన వస్తువులు తిరిగి అప్పగిస్తున్నందుకు అమెరికా ప్రభుత్వానికి మోడీ ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల సాంస్కృతిక వస్తువులను అక్రమ రవాణా చేయడాన్ని నిరోధించవచ్చని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Read Also: Amit Shah: రాహుల్ బాబా మేముండగా ఆ పని ఎన్నటికీ జరగదు..

అంతకుముందు.. 2023లో ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లిన కొద్ది రోజుల తర్వాత, 105 పురాతన వస్తువులు భారతదేశానికి తిరిగి వచ్చాయి. భారత్‌కు సంబంధించిన పురాతన వస్తువులను వివిధ దేశాల నుంచి వెనక్కి తీసుకురావడానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇందులో బ్రిటన్ నుండి 16 కళాఖండాలు, ఆస్ట్రేలియా నుండి 40 మరియు ఇతర ప్రాంతాల నుండి తిరిగి వచ్చాయి. అదే సమయంలో, 2004-2013 మధ్య ఒక కళాఖండం మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చింది. ఈ ఏడాది జులైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సాంస్కృతిక వస్తువులను తిరిగి రప్పించడంపై అమెరికా- భారత్‌ల మధ్య ఒప్పందం జరిగింది. భారత్‌ నుంచి అమెరికాకు కళాఖండాల అక్రమ రవాణాను నిరోధించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం కోసం రెండు దేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి.