తెలంగాణ చేనేత కళాఖండాలకు అమెరికాకి చెందిన రీసెర్చ్ స్కాలర్లు అబ్బురపడ్డారు. తెలంగాణ మంత్రి కే.తారకరామారావుతో అమెరికన్ హ్యాండ్లూమ్ రీసెర్చ్ స్కాలర్ సమావేశం అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులు, చేనేత కళలపై సుదీర్ఘ పరిశోధనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న కైరా మంత్రి కేటీఆర్ ని కలిశారు. తెలంగాణ చేనేత క్లస్టర్లను సందర్శించిన కైరా వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నేతన్నల కళా నైపుణ్యం వారి నిబద్ధత పట్ల అబ్బురపడిన కైరా.. వివరాలు అడిగి మంత్రి ద్వారా తెలుసుకున్నారు.
Read Also:UP Girl Case: 2015లో హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత బతికొచ్చింది
తన అధ్యయనంలో భాగంగా గుర్తించిన పలు అంశాలను మంత్రి కేటీఆర్ తో పంచుకున్నారు కైరా.ఇంతటి కళా నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్ ఉంటుందని తెలిపారు కైరా. ఈ సందర్భంగా తెలంగాణ టెక్స్ టైల్ రంగం, నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కైరాకు వివరించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ చేనేత వస్త్ర పరిశ్రమ నైపుణ్యం, ఆ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్ టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు కురిపించారు. దీర్ఘకాలం పాటు తాను కొనసాగిస్తున్న చేనేతల అధ్యయనంలో భాగంగా ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో కొనసాగుతున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి మరియు అక్కడి స్థితిగతులపైన ఆమె క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
Read Also: Tirumala Fraud: టీటీడీ విజిలెన్స్ ఉచ్చులో మరో అక్రమార్కుడు
