అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష పదవిని వదులుకోనున్నారు. గతంలో అక్రమంగా తుపాకీ కలిగి ఉండటం, పన్ను ఎగవేత కేసులో ఆయన తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించారు. తన కొడుకు క్షమాపణ కోసం అధ్యక్ష పదవిని ఉపయోగించబోనని ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకున్నారు. ఇది మాత్రమే కాదు.. ఈ క్షమాపణ నేరానికి శిక్ష పడకుండా హంటర్‌ను కాపాడుతుంది. కోర్టు విచారణ రద్దు చేయబడుతుంది. హంటర్ బిడెన్ ఉక్రేనియన్ గ్యాస్ కంపెనీ బురిస్మా బోర్డులో పనిచేసిన కాలాన్ని కూడా క్షమాపణ కవర్ చేస్తుంది. ఈ పదవి విదేశీ వ్యాపార ఒప్పందాలపై విచారణకు సంబంధించినది.
READ MORE: Shocking : సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన 12th ఫెయిల్ నటుడు
వైట్ హౌస్ నుంచి బైడెన్ ప్రకటన విడుదల చేశాడు..”ఈ రోజు నేను నా కొడుకు హంటర్ కోసం క్షమాపణపై సంతకం చేశాను. నేను బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి నేను న్యాయ శాఖకు సంబంధించి జోక్యం చేసుకోనని చెప్పాను. నా హామీని సరిగ్గా నిలబెట్టుకున్నాను. అంతేకాదు నా కుమారుడిని టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టారు. నా కుమారుడు హంటర్ ను అన్యాయంగా విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయా. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా.” అని పేర్కొన్నారు.
READ MORE:Telugu States CS Meeting: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల భేటీ.. పెండింగ్ అంశాలపై చర్చ!
హంటర్ బిడెన్‌పై వచ్చిన ఆరోపణలు ఏమిటి?
హంటర్ పన్ను ఎగవేత, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం, ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేయడం, తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇంతకుముందు డెలావేర్ కోర్టులో హంటర్ పన్ను ఎగవేత, అక్రమ తుపాకీని కలిగి ఉన్నట్లు అంగీకరించారు. ఉద్దేశ్యపూర్వకంగా పన్ను చెల్లించడం లేదని ఆరోపించారు. ఆయన 2017- 2018లో $1.5 మిలియన్లకు పైగా పన్ను రిటర్నులను సకాలంలో దాఖలు చేయలేకపోయారు.