G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US President Joe Biden leaves for India to attend G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి తన ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ ప్రయాణంకు ముందు బైడెన్‌కు కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొనబోతున్నారు. బైడెన్ నేటి సాయంత్రం ఢిల్లీకి రానుండగా.. ఆయన వాడే కాడిలాక్ కారు, ది బీస్ట్ కూడా హస్తినకు చేరుకోనున్నాయి. ది బీస్ట్ కారును బోయింగ్ సీ 17 గ్లోబ్ మాస్టర్ 111 కార్గో విమానం తీసుకొస్తుంది. విమానం దిగిన వెంటనే బీస్ట్ కారులో బయలుదేరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బైడెన్ కలుస్తారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన కారుగా పేరున్న ‘ది బీస్ట్’ ఢిల్లీ వీధుల్లో తిరగనుంది. దీనికి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సెక్యూరిటీ ఇస్తారు.
Also Read
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జో బిడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆపై ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఇక శనివారం, ఆదివారం జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో వీరు పాల్గొంటారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు. ఈ హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బిడెన్‌తో పాటు జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి వస్తుంటడంతో.. కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేసింది.
#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI
— ANI (@ANI) September 7, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!