Firing in America: అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఉటా రాష్ట్రంలోని ఎనోచ్ సిటీలో తుపాకీ గాయాలతో 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. అందులో 5 పిల్లలు ఉన్నట్లు చెప్పారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. ఓ ఇంట్లో సాధారణ తనిఖీ నిమిత్తం వెళ్లినప్పుడు ఈ మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఇంటిలో ముగ్గురు పెద్దలు, ఐదుగురు పిల్లలను అధికారులు కనుగొన్నారని, అందరూ తుపాకీ గాయాలతో మరణించారని ఒక ప్రతినిధి తెలిపారు. “ఇంట్లో ఉన్న ఏడుగురిని చంపిన తర్వాత అనుమానితుడు తన ప్రాణాలను తీసుకున్నాడని ఆధారాలు సూచిస్తున్నాయి” అని ఓ ప్రకటన పేర్కొంది. అతని పేరు 42 ఏళ్ల మైఖేల్ హైట్ అని తెలిసింది. తన భార్య విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆ వ్యక్తి కుటుంబంపై కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు గురువారం తెలిపారు.
Lawrence Bishnoi Gang: లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని ఇద్దరు షార్ప్ షూటర్లు సహా ఐదుగురి అరెస్ట్
మృతుల్లో అతని భార్య, ఆమె తల్లి, దంపతుల ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆ ఐదుగురిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్లు తెలిసింది. ఎనోచ్ మేయర్ జియోఫ్రీ చెస్నట్ మాట్లాడుతూ.. వివాహిత వైవాహిక విచ్ఛిన్నం తర్వాత కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఎనోచ్ నగరంలో 8000 మంది నివసిస్తారు. ఉటా రాజధాని సాల్ట్ లేక్ సిటీకి ఈ నగరం 245 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ ఘటనపై ఉటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
