US News: 19 ఏళ్ల యువకుడికి “హిందుత్వం”పై ఇంత ద్వేషమెందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US News: అమెరికాలో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడాలని కుట్ర పన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇల్లినాయిస్లోని పలైటైన్లో నివసించే 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే యువకుడిని ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆరోరా ప్రాంతంలోని ఏదైనా ఒక హిందూ ధార్మిక కేంద్రాన్ని అతడు టార్గెట్ చేయాలని ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఏ దేవాలయంపై దాడి చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. పలైటైన్ పోలీసుల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 11న మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసుల నుంచి సామూహిక కాల్పులకు సంబంధించిన సమాచారం అందింది. పాపోరాకిస్ నుంచి తనకు కొన్ని ఆందోళనకరమైన ఎలక్ట్రానిక్ సందేశాలు అందాయని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచారణలో భాగంగా నిందితుడు సామూహిక కాల్పుల పథకానికి సంబంధించిన ఒక పత్రంతో పాటు రైఫిల్, తూటాల గూళ్లు, బాడీ ఆర్మర్ తదితర ఆయుధాలు, వ్యూహాత్మక పరికరాల చిత్రాలను పంచుకున్నట్లు తేలింది. ఈ 19 ఏళ్ల కుర్రాడికి హిందుత్వంపై ఇంత పగ ఎందుకు పెంచుకున్నాడో విచారణలో తేలనుంది.
ఈ సమాచారం అందిన వెంటనే పలైటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. అక్టోబర్ 11 సాయంత్రం నిందితుడు తన ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి నివాసంలో సోదాలు నిర్వహించగా ఒక రైఫిల్, నిండిన అనేక తూటాల గూళ్లు, వందలాది తూటాలు, వ్యూహాత్మక పరికరాలు, బాడీ ఆర్మర్ వెస్ట్ లభించాయి. ఆ వెస్ట్ మీద శ్వేతజాతీయ ఆధిపత్య తీవ్రవాదానికి సంబంధించిన గుర్తుతో ఉన్న ప్యాచ్ కూడా దొరికింది. ఈ విచారణ సమయంలో నిందితుడు రాసిన ఒక పత్రం పోలీసులకు లభించింది. ‘నేను ఎందుకు పోరాడాను: ఆరోరా షూటర్ ప్రకటన పత్రం’ అనే శీర్షికతో ఉన్న ఆ పత్రంలో శ్వేతజాతీయ ఆధిపత్య, తీవ్రవాద భావజాలంతో పాటు దక్షిణాసియా మూలాలున్న వ్యక్తులు, ముఖ్యంగా భారతీయులపై హింసకు పాల్పడాలనే ఉద్దేశం ఉన్నట్లు వెల్లడైంది. ఈ కేసు దర్యాప్తులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) షికాగో కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. ఉగ్రవాద హెచ్చరికల జారీ, నిర్ణీత పరిమితి కంటే తక్కువ పొడవున్న బ్యారెల్ కలిగిన రైఫిల్‌ను కలిగి ఉండటం వంటి అభియోగాలను పోలీసులు నిందితుడిపై మోపారు. అక్టోబర్ 14న జరిగిన విచారణ అనంతరం కోర్టు అతడిని కస్టడీలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 30కి ఖరారైంది.
Also Read
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
- Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
తాజావార్తలు
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
-
Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
-
Anupama: ‘పెళ్లి కాకున్నా బిడ్డ కావాలనుంది!’.. అనుపమ పరమేశ్వరన్ సంచలన వ్యాఖలు
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!