US-Iran Talks: 21 గంటల హై-లెవల్ మీటింగ్ ఫెయిల్.. చర్చలు విఫలమవ్వడానికి ప్రధానం కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Talks: ప్రస్తుతం ప్రపంచ దృష్టి అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతలపై కేంద్రీకృతమై ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలమవ్వడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఏళ్లుగా నెలకొన్న అపనమ్మకం, ద్వేషాన్ని రాత్రికి రాత్రే పరిష్కరించలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య తీవ్రమైన నమ్మకలోపమే శాంతి ఒప్పందానికి అతిపెద్ద అడ్డంకిగా మిగిలిందని వాన్స్ తెలిపారు. సులభంగా చెప్పాలంటే, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ ఏ పక్షమూ మరొక పక్షాన్ని విశ్వసించడానికి సిద్ధంగా లేదని వాన్స్ వాదన.
READ MORE: Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్ కరువయ్యాయా?
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
కొన్ని దశాబ్దాల తరువాత ఇరాన్, అమెరికా ముఖాముఖి చర్చలు జరిగాయి. పాకిస్థాన్ వేదికగా ఇరు దేశాలకు సంబంధించిన ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. 21 గంటల పాటు కొనసాగిన ఈ భేటీకి అమెరికా తరపున జెడి వాన్స్ స్వయంగా నాయకత్వం వహించారు. అయితే, ఇన్ని గంటల మథనం తర్వాత కూడా ఎటువంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు. అయినప్పటికీ, ఇరాన్ ప్రతినిధులు కూడా ఈ సమస్యకు పరిష్కారం కోరుకుంటున్నారని, దౌత్య మార్గాలు ఇంకా మూసుకుపోలేదని వాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రెండు రోజుల్లో పాకిస్థాన్‌లో మరోసారి ఇరు దేశాలు భేటీ అయ్యే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఈ కీలక చర్చలకు పాకిస్థాన్ ఒక ప్రధాన వారధిలా వ్యవహరిస్తోంది. రాబోయే రెండు రోజుల్లో ఇరు దేశాలు పాకిస్థాన్‌లో మళ్లీ సమావేశం కాగలవా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.
చర్చలు ఎందుకు సఫలం కావడం లేదనే ప్రశ్న మొదలైంది. 21 గంటల పాటు జరిగిన చర్చలలో ఒప్పందం ఖరారు కాకుండా అడ్డుపడిన అసలు విషయం ఏమిటి? అనే సందేహం అందరిలో మెదులుతోంది. అయితే.. ఇక్కడ వచ్చిన సమస్యల్లా అణు కార్యక్రమమే. ఇరాన్ తన యురేనియం శుద్ధిని కనీసం 20 ఏళ్ల పాటు నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతుంటే, ఇరాన్ మాత్రం కేవలం 5 ఏళ్లకు మించి అంగీకరించబోమని తెగేసి చెబుతోంది. ఈ ’15 ఏళ్ల అంతరమే’ ఒప్పందానికి ప్రధాన శత్రువుగా మారింది. దీనికి తోడు ఒకరి షరతులను మరొకరు ఎలా తనిఖీ చేయాలి, భవిష్యత్తులో హామీలు ఏమిటి అనే విషయాలపై కూడా స్పష్టత రాలేదు.
మరోవైపు.. విఫలమైన చర్చల ప్రభావం ఇప్పుడు సముద్రంలో కనిపిస్తోంది. పాకిస్థాన్‌లో చర్చలు విఫలమైన వెంటనే అమెరికా కఠిన వైఖరిని అవలంబించింది. హోర్ముజ్ జలసంధి గుండా ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను దిగ్బంధించింది. తన సైనిక శక్తిని, ఆర్థిక ఒత్తిడిని ఉపయోగించి ఇరాన్‌ను చర్చల బల్ల వద్దకు బలవంతంగా తీసుకురావాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిగ్బంధం ప్రపంచ చమురు సరఫరాలో సంక్షోభం మరింత తీవ్రమవుతుందనే భయాలను సైతం పెంచింది. ఒకవైపు చర్చల ఆశలు, మరోవైపు యుద్ధ మేఘాల మధ్య ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్ట దశలో నిలబడింది. పాకిస్థాన్ వేదికగా జరగబోయే తదుపరి పరిణామాలు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందో లేదో నిర్ణయించనున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!