Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Floods Trap Many In Florida As Hurricane Ian Heads To South Carolina

america floods: అమెరికాలో ఇయాన్ బీభత్సం.. 54మంది మృతి

Published Date :October 2, 2022 , 12:14 pm
By Rakesh Reddy
america floods: అమెరికాలో ఇయాన్ బీభత్సం.. 54మంది మృతి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

america floods: అమెరికాలో హరికేన్ ఇయాన్ బీభత్సం సృష్టించింది. ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో…. కుండపోత వర్షాలు, భారీగా వీస్తున్న గాలులు అట్లాంటిక్ తీర ప్రాంతాన్ని నాశనం చేశాయి. దేశ చరిత్రలో అత్యంత శక్తిమంతమైన ఈ తుపాన్‌ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దక్షిణ కరోలినాపై కూడా ఇయన్ తన ప్రతాపం చూపింది. తుపాన్​ధాటికి ఫ్లోరిడాలో 47మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వరద పోటెత్తడంతో ప్రజలు ఇళ్లల్లో భయంభయంగా గడుపుతున్నారు. విద్యుత్తు సౌకర్యం లేక, ఆహార పదార్థాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్​వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

ఫ్లోరిడాలో విధ్వంసం సృష్టించిన తరువాత దక్షిణ కరోలినా తీరప్రాంతంపై హరికేన్ తన ప్రతాపం చూపింది. చార్ల్‌స్టన్‌ నగరంలో భారీ వర్షాలుకు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భీకర గాలుల వల్ల కొన్ని చోట్ల స్తంభాలు కూలిపోయాయి. శిథిలమైన ఇళ్లలో చిక్కుక్కున్న వారిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైతు వరదలకు గల్లంతైన తమ కుటుంబీకుల ఆచూకీ తెలపాలంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్ట్ చేస్తున్నారు. శనివారం నాటికి ఫ్లోరిడాలో 1,000 మందికి పైగా ప్రజలను అధికారులు కాపాడారు. దాదాపు 2.8లక్షల మంది అంధకారంలోనే ఉన్నారని అధికారులు తెలిపారు.

Also Read

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
  • PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
Add as a preferred
source on google

కరెంట్ సరఫరా పునరుద్ధరణ పూర్తి కావడంతో పరిస్థితి కాస్త మెరుగైంది. అమెరికాలో చరిత్రలో అత్యంత శక్తిమంతమైన హరికేన్లలో ఒకటిగానే కాదు.. భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని కలిగించినవాటిలో ఒకటిగా ఇయన్‌ నిలుస్తోందని అధికారులు చెప్పారు. ఈ హరికేన్‌ వల్ల 10 వేల కోట్ల డాలర్లకుపైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఇయన్‌ తుపాను కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Florida
  • hurricane
  • ian
  • jo biden
  • PM Modi

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions