F-15E Strike Eagle: అగ్రరాజ్యానికి బిగ్ షాక్.. కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
F-15E Strike Eagle: అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అమెరికాకు చెందిన అత్యంత అధునాతనఆల్-వెదర్ మల్టీరోల్ ఫైటర్ జెట్ F-15E స్ట్రైక్ ఈగిల్ (F-15 Strike Eagle) కుప్పకూలింది. ఘటన గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆందోళన కలిగిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కువైట్‌లో ఈ విమానం కూలిపోయింది. విమానం నేలను తాకే ముందు పైలట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు దూకేశాడు. ఘటన అనంతరం భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయిన దృశ్యం కనిపించింది. దీంతో ఎజెక్షన్ వ్యవస్థ సమర్థంగా పనిచేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం.. విమానం కూలే కొన్ని క్షణాల ముందు పైలట్ బయటకు దూకిన దృశ్యాలు కనిపించాయి. ప్రమాద స్థలానికి అత్యవసర సిబ్బంది వెంటనే చేరుకుని ప్రాంతాన్ని భద్రపరిచారు. పైలట్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ప్రాణాపాయం తప్పినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, నిర్వహణలో ఎదురైన సవాళ్లా, లేక బాహ్య ముప్పులా అన్న కోణాల్లో దర్యాప్తు సాగనుంది. గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల పెరిగిన సైనిక చురుకుదనం నేపథ్యంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ఈ యుద్ధవిమానం గగనతల ఆధిపత్యం, భూస్థాయి లక్ష్యాలపై దాడులకు వినియోగించే అత్యాధునిక సామర్థ్యాలు కలిగింది. అందువల్ల ఇలాంటి ఘటన రక్షణ వ్యవస్థలకు కీలకంగా పరిగణించబడుతోంది.
READ MORE: Iran-Israel War: ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ.. ఇజ్రాయెల్‌పై బాంబుల వర్షం!
Also Read
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
ఇటీవల కువైట్ సహా పరిసర దేశాల్లో సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి ఘటనలు చోటుచేసుకున్నాయి. కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు అనేక గగన ముప్పులను అడ్డుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం ప్రాంతీయ భద్రతపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతోంది. అమెరికా, కువైట్ రక్షణ అధికారులు ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యాక మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముంది. భవిష్యత్ మిషన్ల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!