US-Pakistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “నా ఫేవరెట్ జనరల్”, “చాలా గౌరవనీయమైన జనరల్” అని కొనియాడారు. పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో పాటు ఆసిమ్ మునీర్‌ను “గ్రేట్ పీపుల్” అంటూ మెచ్చుకున్నారు. ఈ మాటలు విని పాకిస్థానీలు ఆనందంతో ఉబ్బిపోయారు. ట్రంప్ రూపంలో తమకు ఒక శక్తివంతమైన అండ దొరికిందని భావించారు. కానీ జనవరి 14 రాత్రి అమెరికా జారీ చేసిన ఆదేశం ఆ ఉత్సాహాన్ని ఒక్కసారిగా కూల్చేసింది. అమెరికా పాకిస్థానీలకు ఎంట్రీపై అనిర్దిష్ట కాలానికి నిషేధం విధించింది.
READ MORE: YouTube: టీనేజర్లకు షాక్.. పేరెంటల్ కంట్రోల్స్, షార్ట్స్ స్క్రోలింగ్‌కు యూట్యూబ్ టైమ్ లిమిట్
ఈ జాబితాలో మరో 74 దేశాల పౌరులు కూడా ఉన్నారు. అయినా అందులో పాకిస్థాన్ పేరు ఉండటం అక్కడి పాలకులను షాక్‌కు గురిచేసింది. పాకిస్థాన్, ఇరాన్ సహా మొత్తం 75 దేశాల పౌరులకు ఇమిగ్రెంట్ వీసాల ప్రక్రియను అమెరికా నిలిపివేసింది. ట్రంప్ రెండో కాలంలో ఇమిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేసే దిశగా ఇది కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ ఆదేశం 2026 జనవరి 21 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో స్థిరపడాలనుకున్న పాకిస్థానీల ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ గ్రీన్ కార్డు వంటి శాశ్వత నివాస వీసాల ప్రాసెసింగ్‌ను అనిర్దిష్ట కాలానికి నిలిపివేసింది. ఇమిగ్రెంట్ వీసా అంటే అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతినిచ్చే వీసా. ఇది లభిస్తే వ్యక్తి లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్‌గా మారతాడు.
READ MORE: Funky Release Date: ‘ఫంకీ’ కొత్త పోస్టర్.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
ఈ నిర్ణయం తర్వాత పాకిస్థాన్ సహా ఆ 75 దేశాల పౌరులు అమెరికాలో శాశ్వతంగా స్థిరపడలేరు. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లడం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం, పర్మనెంట్ స్టేటస్ పొందడం అన్నీ కష్టమయ్యాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఈ 75 దేశాల జాబితాలో భారత్ లేదు. అంటే భారతీయులకు అమెరికా ఇమిగ్రెంట్ వీసాలు జారీ చేయడం కొనసాగుతుంది. ఇప్పుడు పాకిస్థాన్‌లో ఒకే చర్చ నడుస్తోంది. సంబంధాలు బాగున్నాయంటే, అమెరికా ఇలా ఎందుకు నిషేధం విధించిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అమెరికా తమకు వెన్నుపోటు పొడిచిందని చెబుతున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ టామీ పిగాట్ స్పందిస్తూ, అమెరికాపై భారంగా మారే అవకాశం ఉన్నవారిని, ప్రభుత్వ సహాయంపై ఆధారపడే వారిని అర్హులుగా పరిగణించబోమని స్పష్టం చేశారు.