US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Army Chief Fired: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిపోయిన అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్న ఇప్పుడు మామూలు సంచలనం సృష్టించడం లేదు. ఒక పక్క ఇరాన్‌తో భీకర యుద్ధం కొనసాగుతుండగా.. ఇదే సమయంలో యూఎస్ ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని అల్టీమేటం జారీ చేయడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆదేశం యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నుంచి వచ్చింది. జనరల్ జార్జ్ ఇంకా రాజీనామా చేయలేదని, అయితే హెగ్సెత్ నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఆయన ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. ఈ చర్య పెంటగాన్ (యూఎస్ రక్షణ శాఖ)లో ఒక ముఖ్యమైన నాయకత్వ మార్పును సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇరాన్‌పై భూతల సైనిక చర్యకు అమెరికా సన్నద్ధమవుతున్నందున, ఇప్పుడు అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైనదిగా భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో భారీ సంఖ్యలో అమెరికా సైనికులను మోహరిస్తున్నారు. ఇరాన్‌ను “రాతియుగానికి” తిరిగి పంపిస్తానని, భారీ దాడులు ప్రారంభిస్తానని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. యూఎస్ ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తప్పించడానికి కారణమేమిటో స్పష్టంగా తెలియనప్పటికీ, డొనాల్డ్ ట్రంప్ సైనిక ప్రణాళికలను అమలు చేయడంలో జనరల్ రాండీ జార్జ్ సామర్థ్యంపై ఆందోళనలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఒక రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
అధ్యక్షుడు ట్రంప్, ఆయన విధానాలతో ఏకీభవించే ఒక జనరల్‌కు సైన్యం కమాండ్‌ను అప్పగించాలని అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ కోరుకున్నారని సమాచారం. “జనరల్ రాండీ జార్జ్ చేసిన సేవలకు మేము కృతజ్ఞులం, కానీ సైన్యంలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైంది” అని ఒక సీనియర్ సైనిక అధికారి చెప్పినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. జనరల్ జార్జ్ 2021 నుంచి 2022 వరకు బైడెన్ పరిపాలనలో రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు సీనియర్ మిలిటరీ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. ఆయనకు దశాబ్దాల సుదీర్ఘ సైనిక అనుభవం ఉంది. ఆయన యూఎస్ ఆర్మీ తరపున గల్ఫ్ యుద్ధంతో పాటు ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలలో కూడా పనిచేశారు. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యొక్క సాధారణ పదవీకాలం నాలుగు సంవత్సరాలు. యూఎస్ ఆర్మీ చీఫ్‌గా ఆయన నియామకం జో బైడెన్ పదవీకాలంలో జరిగింది. 2023లో జనరల్ రాండీ జార్జ్‌ను జో బైడెన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించగా, దానికి సెనేట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయన పదవీకాలం 2027 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే తాజా పరిణామాల మధ్య ఆయన తర్వాత యూఎస్ ఆర్మీ ఛీప్‌గా ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన జనరల్ క్రిస్టోఫర్ లానెవ్ ముందు వరుసలో ఉన్నారు. లానెవ్ 2022 నుంచి 2023 వరకు 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండింగ్ జనరల్‌గా పనిచేశారు. 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ పారాచూట్ దాడులలో ప్రత్యేకత స్థానం కలిగి ఉంది. ప్రస్తుతం, ఈ డివిజన్‌కు మేజర్ జనరల్ బ్రాండన్ టెగ్ట్మేయర్ కమాండర్‌గా ఉన్నారు.
READ ALSO: Biker Review: బైకర్ రివ్యూ
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!