Biker Overseas Review : శర్వానంద్ బైకర్ ఓవర్సీస్ రివ్యూ.. ట్రాక్ తప్పాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో శర్వానంద్, సీనియర్ నటుడు రాజశేఖర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘బైకర్’. నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గత రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఓవర్సీస్ నుండి ఈ సినిమాకు వస్తున్న టాక్ ఎలా ఉందంటే.. రేసింగ్ టీం కు కోచ్ గా వ్యహరించే ( బుల్లెట్ సునీల్) రాజశేఖర్ మలేషియన్ రేసింగ్ లో జరిగే పోటీలో తన కొడుకు (విక్కీ) శర్వానంద్ మూడవ స్థానంతో సరిపెట్టుకుంటాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రేసింగ్ నుండి తప్పుకుంటాడు. తర్వాత విక్కీ రేసింగ్ లోకి ఎందుకు వచ్చాడు. తన తండ్రి కోరికను నెరవేర్చడా లేదా అనేది మిగిలిన సినిమా.
పాజిటివ్ పాయింట్స్ : ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ రాజశేఖర్ మరియు శర్వానంద్ మధ్య సాగే తండ్రీకొడుకుల అనుబంధం. రాజశేఖర్ తన కెరీర్‌లో ఒక బలమైన ఇంపాక్ట్‌ఫుల్ పాత్రను పోషించారు. కథలో తండ్రి ఇచ్చే సపోర్ట్, కొడుకు పడే తపన చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. సినిమాలోని రేసింగ్ సీన్లు హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గని రీతిలో ఉన్నాయి. ప్రథమార్థంలో వచ్చే ఒక ‘జంప్ సీన్’ థియేటర్లలో విజిల్స్ వేస్తారు. శర్వానంద్ ఒక రేసర్‌గా మారడానికి పడిన కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. రేసింగ్ ట్రాక్‌పై జరిగే యాక్షన్ సీక్వెన్స్ చాలా గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతాయి.సంగీత దర్శకుడు జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రేసింగ్ సీన్లలో సౌండ్ మిక్సింగ్ అద్భుతంగా ఉంది.
Also Read
నెగిటివ్ పాయింట్స్ : ఈ సినిమాకు ప్రధానమైన మైనస్ కథ. మోటోక్రాస్ రేసింగ్ ని కీలకంగా ఎంచుకుని మిగిలిన కథని చాల రొటీన్ గా రాసుకున్నాడు దర్శకుడు. దానికి తోడు స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం బోరింగ్ అనిపిస్తుంది. దర్శకుడు కేవలం రేసింగ్ సీన్స్ పై ఫోకస్ చేసి మిగిలిన కథను రోటిన్ మేకింగ్ తో నిరాశపరిచాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా స్లోగా బోరింగ్ గా అనిపిస్తుంది. పాటలు ఒక్కటి కూడా హమ్ చేసేలా ఉండవు. హీరో రేసింగ్ వదిలేయడానికి దారి తీసిన పరిస్థితులు, మళ్లీ రేసింగ్ మొదలుపెట్టాలనుకోవం వంటి సీన్స్ చాలా చప్పగా ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు దర్శకత్వం ఎలా ఉందొ. జెట్ స్పీడ్ తో ట్రాక్ ఎక్కిన బైకర్ కొద్దీ సేపటికే ట్రాక్ తప్పి ఆడియన్స్ ను నిరాశపరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బైకర్.. హంగులు తక్కువ.. రిపేర్లు ఎక్కువవడంతో యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!