Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Sharwanand Biker Movie Review Rating Motocross Telugu Film

Biker Review: బైకర్ రివ్యూ

Published Date :April 3, 2026 , 6:58 am
By Bhargav Chaganti
Biker Review: బైకర్ రివ్యూ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Rating : 3 / 5

  • MAIN CAST: Sharwa, Rajasekhar, Malavika Nair, Brahmaji, Naveen Neni and others
  • DIRECTOR: Abhilash Reddy
  • MUSIC: Ghibran
  • PRODUCER: UV Creations

శర్వా హీరోగా నటించిన ‘బైకర్’ సినిమా ఎప్పుడో ‘అఖండ 2’తోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ‘అఖండ 2’తో ఎందుకు అని వెనక్కి వెళ్ళిన ఈ సినిమా టీం, ఎట్టకేలకు ఏప్రిల్ మూడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది చిత్ర బృందం. అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్ సన్నిహితులు ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ కృష్ణా రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇండియాలోనే మొట్టమొదటి మోటోక్రాస్ మూవీగా, తెలుగులో మొట్టమొదటి డాల్బీ విజన్ సినిమాగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

బైకర్ కథ:
విక్కీ అలియాస్ విక్రమ్ నారాయణ్ (శర్వానంద్), తన భార్య అనన్య (మాళవిక నాయర్), తన కొడుకుతో కలిసి ఒక సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. తాను గో-కార్టింగ్ రేస్ ట్రాక్ నిర్వహిస్తూ ఉంటే, భార్య అతనికి చేదోడు వాదోడుగా ఒక బోటిక్ నిర్వహిస్తూ ఉంటుంది. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి, విక్రమ్ తండ్రి సునీల్ నారాయణ (రాజశేఖర్) మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపు వస్తుంది. తాను తన తండ్రికి అండగా నిలబడాలంటూ విక్కీ తన భార్యకు చెప్పి, తన తండ్రి దగ్గరకు బయలుదేరుతాడు. అయితే అప్పటివరకు తన తండ్రి నుంచి విక్కీ ఎందుకు దూరంగా ఉన్నాడు? బైకర్‌గా భారతదేశం మొత్తం కీర్తింపబడ్డ విక్కీ, ఎందుకు ఆ బైక్ రేసింగ్ వదిలేసి తండ్రికి దూరంగా వచ్చేసాడు? చివరికి తన తండ్రి మీద పడ్డ అవినీతి మరకలకు విక్కీ ఎలాంటి సమాధానం ఇచ్చాడు? అనేదే ఈ సినిమా కథ.

Also Read

  • Sathi Leelavathi Movie Review : లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' మూవీ రివ్యూ
  • Razor Movie Review : రేజర్ మూవీ రివ్యూ
  • M4M Movie Review : 'ఎం4ఎం' రివ్యూ
  • Godari Gattupaina Movie Review : గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
Add as a preferred
source on google

విశ్లేషణ:
సాధారణంగా తెలుగు వెండితెరపై స్పోర్ట్స్ డ్రామాలు అంటే క్రికెట్ లేదా కబడ్డీ వంటి కథలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, దానికి భిన్నంగా బైక్ రేసింగ్ అనే సరికొత్త బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని ఈ ‘బైకర్’ను రూపొందించారు. నిజానికి ఏ స్పోర్ట్స్ సినిమాకైనా ఒకే ఫార్ములా ఉంటుంది—హీరో మొదట ఓడిపోవడం, అవమానాలు ఎదుర్కోవడం, చివరకు పట్టుదలతో విజయం సాధించడం. ‘బైకర్’ కూడా అదే బాటలో సాగుతుంది. అయితే, ఇక్కడ రేసింగ్ ట్రాక్‌పై సాగే ఉత్కంఠభరితమైన విన్యాసాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బైక్ రేసింగ్ అనేది తెలుగు ప్రేక్షకులకు కనెక్టివిటీ విషయంలో కొంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ, స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రం ఇది భలే నచ్చేస్తుంది.
గతంలో వచ్చిన ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘జెర్సీ’ వంటి ఎన్నో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి; ఇది కూడా దాదాపుగా అలానే ఆకట్టుకునే విధంగానే సాగుతుంది. ఒకపక్క గతాన్ని, మరోపక్క ప్రస్తుతాన్ని చూపిస్తూ నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి, చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ విక్కీ ప్రశాంతమైన జీవితాన్ని చూపిస్తూనే, తన తండ్రికి ఎందుకు దూరమయ్యాడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సెకండ్ హాఫ్‌లో విక్కీ తన తండ్రి కోసం ఎలా నిలబడ్డాడు అనే విషయాన్ని చూపిస్తూనే, తండ్రికి మాట రానివ్వకుండా కొడుకులు ఎంత దూరానికైనా వెళ్తారనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించాడు. తండ్రిని ప్రేమించే కొడుకులకు, కొడుకులను ప్రేమించే తండ్రులకు ఒక ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని దర్శకుడు రాసుకున్నాడు. ఒకపక్క రేసింగ్ ఎపిసోడ్స్ ఎంత రేసీగా చిత్రీకరించాడో, మరోపక్క ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా అంతే బలంగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా గుండెల్ని పిండేలా కాకుండా, ఆలోచింపజేసేలా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

నటీనటుల ప్రతిభ: ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ పడ్డ కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ బైకర్‌లా కనిపించడం కోసం ఆయన సుమారు 23 కేజీల బరువు తగ్గి, తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. నటన పరంగా కూడా శర్వా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చాలా కాలం తర్వాత యాంగ్రీమెన్ రాజశేఖర్ ఈ సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆయన పాత్ర కథలో కీలకమైన మలుపులు తెస్తుంది. అయితే, కొన్ని చోట్ల ఆయన మేకప్ కాస్త అతిగా అనిపించినా, నటనతో దానిని కవర్ చేశారు. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ తన పరిధి మేరకు నటించినప్పటికీ, లుక్స్ పరంగా ఆమె పాత్రకు ఆమె వయసు కంటే కాస్త ఎక్కువ వయసు ఉన్నట్లుగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం: దర్శకుడు అభిలాష్ రెడ్డి రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకుని కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమాకు ఇది కొత్త పాయింట్ కావడంతో ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. అయితే, సినిమా రెండు గంటల 40 నిమిషాల నిడివి ఉండటం కాస్త ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలను రెండు గంటల 20 నిమిషాల్లో ముగించి ఉంటే మరింత వేగంగా, ఆసక్తికరంగా ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నికల్‌గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాల్లో ఒకటి. ఇలాంటి రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలానే సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాలి. సినిమా విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చుపెట్టిన యు.వి. క్రియేషన్స్ ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ముఖ్యంగా అలాంటి లొకేషన్స్ కి వెళ్లి షూట్ చేసుకువచ్చిన సినిమా టీం మొత్తాన్ని అభినందించాల్సిందే. రొటీన్ కథలు ఎవరైనా చేస్తారు, కానీ ఊపిరి బిగబట్టుకుని చూసేలా రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన టీం మొత్తం ఖచ్చితంగా ‘లయన్ హార్ట్స్’ అనే చెప్పాలి.

ఫైనల్ వర్డిక్ట్: ‘బైకర్’ స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి మాంచి కిక్కిస్తుంది. ముఖ్యంగా డాల్బీ విజన్ లాంటి అడ్వాన్స్‌డ్ స్క్రీన్స్‌లో చూసిన వారు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhilash Reddy movie
  • Biker film analysis
  • Biker movie review
  • Biker public talk
  • Biker rating

తాజావార్తలు

  • Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!

  • Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!

  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!

ట్రెండింగ్‌

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions