NTV Telugu Site icon

US: అమెరికాలో మళ్లీ కాల్పులు, ముగ్గురు మృతి

Faene

Faene

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది. మ్యాడ్ బుట్చర్ కిరాణా దుకాణంలో కాల్పులు జరుగగా.. అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి దుండగుడిపై కూడా కాల్పులు జరిపారు. ఆ క్రమంలో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Delhi: రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, సహచర మంత్రులు

గాయపడిన వారిలో ఇద్దరు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఉన్నారు. అయితే వారి పరిస్థితి ప్రాణాపాయం కాదని విలేకరుల సమావేశంలో పోలీసులు తెలిపారు. గాయపడిన వారంతా కోలుకుంటున్నారని వెల్లడించారు. నిందితుడు న్యూ ఎడిన్‌బర్గ్‌కు చెందిన 44 ఏళ్ల ట్రావిస్ యూజీన్ పోసీగా పోలీసులు గుర్తించారు. షూటర్‌ను అరెస్టు చేశారు. అధికారులతో జరిగిన కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఇది కూడా చదవండి: Suicide: ఏం కష్టమచ్చిందో.. ఢిల్లీలో వేర్వేరు చోట్ల దంపతుల ఆత్మహత్య