US Venezuela Conflict: వెనిజులాపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Venezuela Conflict: వెనిజులాపై అగ్రరాజ్యం అమెరికా బాంబులతో విరుచుకుపడింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో శనివారం తెల్లవారుజామున అగ్రరాజ్యం దాడి కారణంగా అనేక శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సంభవించిన పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురై, వీధుల్లోకి పరుగులు తీశారు. అమెరికా దాడి కారణంగా వెనిజులా అధ్యక్ష భవనం చుట్టూ సైరన్లు మోగాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:50 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది.
READ ALSO: Allu Arjun : బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. అట్లీ తర్వాత లోకేష్ కనగరాజ్‌తో?
Also Read
- How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
- ఇక సెలవు.. నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
- ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
- Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్‌లు..!
ఈ పేలుళ్ల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో రాత్రి చీకటిలో పొగలు ఎగసిపడుతున్నట్లు కనిపించాయి. పలు నివేదికల ప్రకారం.. కారకాస్, తీరప్రాంతాలు, హిగ్యురోట్ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే పేలుళ్లపై వెనిజులా ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ సంఘటనల మధ్య అమెరికా.. వెనిజులా అన్ని విమానాలకు గగనతలాలను మూసివేసినట్లు ప్రకటించింది. వెనిజులాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అమెరికా హెచ్చరించిన సమయంలో ఈ నిర్ణయం రావడం విశేషం. గురువారం ప్రసారం చేసిన ముందస్తు రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాట్లాడుతూ.. వెనిజులాలో ప్రభుత్వ మార్పుపై ఒత్తిడి తీసుకురావాలని, దేశంలోని విస్తారమైన చమురు నిల్వలను పొందాలని అమెరికా కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
READ ALSO: The Raja Saab Runtime: తగ్గిన ‘ది రాజాసాబ్’.. ఫైనల్ రన్ టైం ఇదే!
తాజావార్తలు
-
How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
-
Rao Bahadur: ‘నేను ఎప్పుడూ సహజీవనం చేస్తుంటాను’.. ప్రెస్ మీట్ లో సత్యదేవ్ మాటల తూటాలు!
-
ఇక సెలవు.. నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!
-
Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్డేట్.. పిల్లల గుర్తింపుకు సంబంధించిన ఈ సేవ ఆ తేదీ వరకు ఫ్రీ..!
ట్రెండింగ్
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్‌ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!