Winter Storm: అమెరికాలో తుఫాన్ దెబ్బకు రెండు వేల విమానాలు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాపై మంచు తీఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ శీతాకాలపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మిడ్‌వెస్ట్ చుట్టు పక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నాయి. ఈ తుఫాన్ వల్ల ఏకంగా 2000 విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. మరో 2400 విమానాలు లేట్ గా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారని చెప్పారు.
Read Also: ECIL Recruitment 2024: ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
కాగా, చికాగోలోని ఓ’హేర్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో 40 శాతం విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. ఇందులో 36 శాతం విమానాలు ఈ ఎయిర్‌పోర్టుకు రావాల్సి ఉండగా.. ఇక చికాగో మిడ్‌వేస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఇక్కడికి రావాల్సిన 60 శాతం విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం, మిల్వాకీ మిచెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులతో పాటు పలు ఎయిర్‌పోర్టులు పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసినట్టు పేర్కొంటున్నాయి. ‘737 మ్యాక్స్ 9 విమానాల’ ల్యాండింగ్‌లో ఇబ్బంది ఉండటంతో.. పెద్ద సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ కావడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలను దృష్టి పెట్టుకొని పెద్ద సంఖ్యలో విమానాలను క్యాన్సిల్ చేస్తుంది.
Read Also: Medicine Price : ఫార్మా కంపెనీలపై ‘రూల్స్’ కత్తి.. భారీగా పెరగనున్న మందుల ధరలు
ఇక, తీవ్రమైన మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. తీవ్రమైన గాలులతో గ్రేట్ లేక్స్, సౌత్ ఏరియాలో సుమారు 2, 50,000 ఇళ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా కావడం లేదు. ఇల్లినాయిస్‌లో దాదాపు 97,000 మంది చీకటిలో ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాన్ యునైటెడ్ స్టేట్స్ తూర్పు భాగంలో వ్యాపించి ఉందని సీఎన్ఎన్ రిపోర్ట్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!