NTV Telugu Site icon

Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ

Urvil Patel

Urvil Patel

Urvil Patel: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. త్రిపుర క్రికెట్ జట్టుపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. త్రిపుర అందించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పటేల్ ఇన్నింగ్స్ 35 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అతని టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కూడా. అతని సెంచరీ సాయంతో త్రిపురపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 32 బంతుల్లో (2018)లో సెంచరీ సాధించిన రిషబ్ పంత్ రికార్డును 26 ఏళ్ల ఉర్విల్ బద్దలు కొట్టాడు.

Also Read: V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..

దింతో పటేల్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో T20 క్రికెట్ చరిత్రలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది సైప్రస్‌తో జరిగిన టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లో సెంచరీ చేసిన ఎస్టోనియా క్రికెట్ జట్టుకు చెందిన సాహిల్ చౌహాన్ మాత్రమే అతని కంటే ముందున్నాడు. ఈ జాబితాలో 30 బంతుల్లో సెంచరీ సాధించిన క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది. త్రిపుర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శ్రీదామ్ పాల్ 49 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్ష్య ఛేదనలో పటేల్ సెంచరీతో 10.2 ఓవర్లలో గుజరాత్ విజయానికి అవసరమైన స్కోరు సాధించింది. గుజరాత్‌కు చెందిన పటేల్, ఆర్య దేశాయ్ తొలి వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఇకపోతే, ముగిసిన IPL 2025 వేలంలో పటేల్‌ను ఏటీం కొనుగోలు చేయలేదు.