Urvashi : తిండీ నిద్ర మానేసి రాత్రంతా అదే పని.. నా ఆరోగ్యం నాశనం చేసుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళం, మలయాళంతో పాటు అన్ని భాషల్లో కలిపి 350కి పైగా సినిమాలు చేసి మెప్పించారు నటి ఊర్వశి. ఇప్పటికి కూడా తన వయసుకు తగ్గ పాత్రలు ఎంచుకుంటూ నటిస్తోంది. సినిమా కెరీర్ ఎలా ఉన్నప్పటికీ తెర వెనుక.. నటీనటుల జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. అలాగే ఊర్వశి జీవితంలో కూడా చాలా కష్టాలు పడినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు..
Also Read : Salman Khan : ఒంటరితనమే మిగిలింది..
Also Read
- Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
- Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
- FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
- Vaibhav Sooryavanshi: వరల్డ్ రికార్డు బద్దలుగొట్టిన "బేబీ బాస్" వైభవ్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
2000వ సంవత్సరంలో నటుడు మనోజ్ కె. జయన్ ను పెళ్లి చేసుకున్నా ఆమెకు తేజ లక్ష్మి అనే కూతురు కూడా ఉంది. కానీ ఈ ఇద్దరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం సాగలేదు. 2008లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఊర్వశి 2013లో శివప్రసాద్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, తన మొదటి పెళ్లి ఎందుకు ఫెయిల్ అయ్యిందనే విషయాన్ని ఊర్వశి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఊర్వశి తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మొదటిసారి పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు అక్కడ వాతావరణం చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఇంట్లో అందరూ కలిసి తాగడం, తినడం చేసేవారు. ఆ వాతావరణానికి నేను అడ్జస్ట్ కావడానికి చాలా ప్రయత్నించి, చివరికి వారి పద్ధతులు నేర్చుకున్నా. దీంతో షూటింగ్ నుంచి రాగానే మందు కొట్టడం అలవాటైపోయి, అదే క్రమంగా వ్యసనంగా మారిపోయింది. అప్పటికే ఇంటి బాధ్యత నా భుజాలపై పడటంతో ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వచ్చింది. నా అభిప్రాయం ఎవ్వరికి నచ్చకపోవడం, గొడవలు జరగడంతో.. కోపంతో మరింత ఎక్కువ తాగేదాన్ని. తిండీ నిద్ర మానేసి మరీ తాగి, చేజేతులా నా ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. కానీ నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్లే ఈ వ్యసనం నుంచి బయటపడగలిగాను’ అని ఊర్వశి చెప్పుకొచ్చారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Motorola Edge 70 Fusion: 7000mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్‌తో.. మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ కొత్త వేరియంట్ విడుదల
-
Sai Krishna: సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు బట్టబయలు..
-
Vaibhav Suryavanshi: నెల రోజుల్లో 4సార్లు..మరో సచిన్‌లా మారుతున్న వైభవ్..ఈ లెక్కలే సాక్ష్యం !
-
Meenakshi Natarajan: నామినేషన్ వివాదంపై మీనాక్షి క్లారిటీ.. బీజేపీపై విమర్శలు.!
-
FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!