NTV Telugu Site icon

Woman Strangled Infant: తల్లి కాదు రాక్షసి.. 3 రోజుల పసికందును..

Infant

Infant

Woman Strangled Infant: ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నా తల్లి ప్రేమ మాత్రం వర్ణించలేనిదని ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన పిల్లలు ఎలా ఉన్నా తల్లి మాత్రం తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రతి క్షణం పిల్లలపై ఎలాంటి కల్మషం లేకుండా ప్రేమను చూపిస్తుంది. ఇక తొమ్మిది నెలలు కడుపులో మోయడమే కాదు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది తల్లి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన మహారాష్ట్రలో జరిగింది.

తన కడుపున పుట్టిన చిన్నారి విషయంలో కాస్తయినా జాలి చూపించలేకపోయింది ఆ తల్లి. చివరికి పిల్లల విషయంలో కర్కశంగా ప్రవర్తించి మూడు రోజుల శిశువు ప్రాణాలను తీసేసింది. రెండో ప్రసవంలో కూడా అమ్మాయి పుట్టిందని కలత చెందిన తల్లి 3 రోజుల పసికందును చంపింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో తన మూడు రోజుల కుమార్తెను హత్య చేసినందుకు ఒక మహిళను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శనివారం తెలిపారు. 25 ఏళ్ల మహిళ రెండో ఆడబిడ్డను ప్రసవించడంతో కలత చెంది డిసెంబర్ 29న పసికందును గొంతు నులిమి హత్య చేసిందని, విచారణలో తేలిందని గోటెగావ్ పోలీస్ స్టేషన్‌లోని ఓ అధికారి తెలిపారు.

Serial Killer: హడలెత్తిస్తున్న సీరియల్ కిల్లర్.. వృద్ధ మహిళలే లక్ష్యం, ఇప్పటివరకు 3 హత్యలు

ఉస్మానాబాద్‌లోని లోహరా తహసీల్‌లోని హోలీ నివాసి అయిన ఓ మహిళ, కాసర్ జవాలా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. ఆమె మూడు రోజుల పసికందును రుమాలుతో గొంతు నులిమి చంపింది. విచారణ తర్వాత ఆమెను శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఈ వివరాలను సబ్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ కంబాలే చెప్పారు.