Site icon NTV Telugu

Uppal Stadium : ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నా

Uppal Stadium

Uppal Stadium

ఉప్పల్‌ స్టేడియం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. దీంతో.. రేపటి మ్యాచ్ పై నీలినీడలు అలుముకున్నాయి. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని సిబ్బంది ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగారు. కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది సిబ్బంది మెరుపు ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా తమకు బోనస్ ఇవ్వడం లేదని, ఇంక్రిమెంట్లు వేయడం లేదని నిరసిస్తూ సిబ్బంది ధర్నా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మ్యాచ్ టికెట్లను ఇవ్వకుండా హెచ్ సీఏ ఆఫీస్ బేరర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు సిబ్బంది.

జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ సమయంలోనే తమకు ఇంక్రిమెంట్లు ఇస్తామని అధ్యక్షుడు జగన్ మోహన్ రావు నాయకత్వంలోని కొత్త పాలక వర్గం హామీ ఇచ్చిందని, కానీ నాలుగు నెలలు గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ సమయంలోనే అధ్యక్షుడు జగన్ మోహన్ రావు నాయకత్వంలోని కొత్త పాలక వర్గం ఇంక్రిమెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని.. నాలుగు నెలలు గడిచినా దాన్ని ప‌ట్టించుకోలేద‌న్నారు. అంతేకాకుండా.. ఇంత‌క‌ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు బ‌కాయిలు చెల్లించలేదని స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై హెచ్ సీఏపై తీవ్ర విమర్శలు వ్య‌క్తం అయిన సంగ‌తి తెలిసిందే.

 

Exit mobile version