NTV Telugu Site icon

Uppal Fly Over: ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పునఃప్రారంభం

Uppal Yadadri Flyover

Uppal Yadadri Flyover

Uppal Fly Over: హైదరాబాద్ (HYD) నుంచి యాదాద్రి (Yadadri) , వరంగల్ (Warangal) మార్గంలో పెండింగ్లో ఉన్న ఉప్పల్-నారపల్లి (Uppal-Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. గాయత్రి కన్‌‌స్ట్రక్షన్స్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో, టెండర్ రద్దు చేయడం జరుగుతుందని, ఈ హెచ్చరికపై కంపెనీ పనులను తిరిగి ప్రారంభించింది. ఈ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రారంభించాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లై ఓవర్ నిర్మించబడుతోంది. ఈ ప్రాజెక్టుకు రూ.600 కోట్లగా అంచనా వేసినప్పటికీ, 2020 జూలైలో పూర్తి చేయాల్సిన పనులు వివిధ కారణాల వల్ల ఆలస్యమయ్యాయి.

GameChanger : పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ఈ గేమ్ ఛేంజర్ : శంకర్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఈ పనులను మళ్లీ ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం, సీపీఆర్‌‌ఐ దగ్గర సర్వీస్ రోడ్డు పనులు ప్రారంభించబడ్డాయి, ఇంకా రాత్రి వేళల్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతాయి. ఇందులో ర్యాంప్, పిల్లర్ల నిర్మాణం కూడా చేపట్టే ప్రయత్నం జరుగుతుంది.

బీఆర్ఎస్ హయాంలో 2018లో ప్రారంభమైన ఈ ఫ్లై ఓవర్ పనులు ఇప్పటి వరకు 44 శాతం మాత్రమే పూర్తయ్యాయి. అధికారులు చెబుతున్న ప్రకారం, ఇప్పటివరకు 37 శ్లాబులు మాత్రమే వేయబడినట్లు తెలిపారు. 2025 జనవరి నుండి 1½ సంవత్సరాలలో ఈ పనులు పూర్తిచేయాలని ఎన్‌‌హెచ్‌‌ఏఐ అధికారులు గడువు విధించారు, తద్వారా పనులు శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లో కనీసం ఒక స్లాబ్‌ పనుల్ని పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే, కేంద్ర రహదారులు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్, ఎస్‌ఈ ధర్మారెడ్డిలకు ఆయన్ను ఆదేశించారు.

Indian American: డొనాల్డ్ ట్రంప్‌ పాలకవర్గంలో మరో భారత్- అమెరికన్‌..

Show comments