UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా పర్స్‌తో పనిలేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సింపుల్‌గా UPI ద్వారా పేమెంట్ చేస్తున్నారు.. అయితే, రూ.2,000 దాటిన UPI మర్చంట్ చెల్లింపులపై ఈ నెల 15వ తేదీ నుంచి 0.4 శాతం Merchant Discount Rate (MDR) అమల్లోకి రానుంది. రూ.2,000 వరకు UPI చెల్లింపులపై రుసుము ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే MDR ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపకూడదని పేర్కొంది. అయితే, వ్యాపారులు ఈ ఖర్చును వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై Local Circles నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి..
291 జిల్లాల నుంచి UPI వినియోగదారుల నుంచి 67 వేలకు పైగా స్పందనలు వచ్చినట్లు ఇండియా టుడే పేర్కొంది.. అదనపు ఛార్జీ చెల్లించాల్సి వస్తే కేవలం 14 శాతం మంది మాత్రమే UPIనే కొనసాగిస్తూ ఆ ఖర్చును భరిస్తామని చెప్పారు. మిగిలినవారు ఇతర చెల్లింపు విధానాలను ఎంచుకోవడం లేదా కొనుగోలును వాయిదా వేయడం చేస్తామని తెలిపారు. అంటే, వ్యాపారి UPI ఛార్జీని కస్టమర్‌పై వేస్తే 76 శాతం మంది మరో మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉందని సర్వే సూచిస్తోంది. నగదు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, బ్యాంక్ బదిలీ వంటి ప్రత్యామ్నాయాల వైపు మారే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.
Also Read
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఉదాహరణకు రూ.5,000 విలువైన వస్తువుకు UPI ద్వారా చెల్లిస్తే 0.4 శాతం MDR ప్రకారం రూ.20 అవుతుంది. అయితే ఈ MDRను వినియోగదారుడి నుంచి ప్రత్యేకంగా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో వ్యాపారులపై నిర్వహించిన మరో Local Circles సర్వేలో కూడా MDRపై పరిమిత అంగీకారం కనిపించింది. రూ.2,000కు పైబడిన UPI చెల్లింపులపై 0.4 శాతం MDRను తాము భరిస్తామని కేవలం 17 శాతం మంది వ్యాపారులు చెప్పారు. 41 శాతం మంది ఎలాంటి MDRనూ భరించబోమని తెలిపారు. ఈ సర్వేకు 242 జిల్లాల నుంచి 32 వేలకు పైగా స్పందనలు వచ్చాయి.
UPI వినియోగం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఉంది. NPCI గణాంకాల ప్రకారం 2026 ఆగస్టులో UPI ద్వారా 24,508.96 మిలియన్ (24.51 బిలియన్) లావాదేవీలు, మొత్తం రూ.29.82 లక్షల కోట్ల విలువతో జరిగాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న MDR విధానం పెద్ద మొత్తాల UPI చెల్లింపులపై వినియోగదారులు, వ్యాపారుల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కీలకంగా మారింది. ప్రభుత్వం మాత్రం MDRను వినియోగదారులపై అదనపు ఛార్జీగా మోపకూడదనే విషయాన్ని స్పష్టం చేసింది..
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!