కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.విభిన్న కథలతో సినిమాలు తీసి అందరిని అలరిస్తూ వుంటారు ఉపేంద్ర..తెలుగు లో కూడా ఈయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది..ఉపేంద్ర నటించిన కన్నడ సినిమాలు తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. అంతేకాదు డైరెక్ట్ తెలుగు సినిమాల లో కూడా నటించాడు ఉపేంద్ర రక్తకన్నీరు, కన్యాదానం మరియు సన్నాఫ్ సత్యమూర్తి వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో ఆయన నటించాడు. కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకున్నాడు ఉపేంద్ర. ఇటీవల ఆయన కబ్జా అనే పాన్ ఇండియా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
అయితే ఉపేంద్ర మరో కొత్త సినిమాను స్టార్ట్ చేసినట్లు సమాచారం.. అదే బుద్ధివంత 2. 2009లో ఉపేంద్ర నటించిన బుద్ధివంత అనే సినిమా విడుదలయి సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తెలుగులో బుద్దిమంతుడు గా విడుదలయి మంచి విజయం సాధించింది.ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో రాబోతున్నాడు ఉపేంద్ర.తాజాగా దీనికి సంబంధించి విడుదల అయిన ఉపేంద్ర ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖానికి మాస్క్ తో ఎంతో డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు ఉప్పీ.ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోన్న బుద్ధివంత 2 ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని చిత్రబృందం తెలియ జేసింది. టిఆర్ చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘బుద్ధివంత 2’ చిత్రానికి జయరామ్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కోసం ఉపేంద్ర అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాగే దీంతో పాటు ఉపేంద్ర ‘యుఐ’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆయనే తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఉపేంద్ర వంటి పక్కా మాస్ సినిమాలో ఆయనను చూడాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.