Site icon NTV Telugu

Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ

Maxresdefault

Maxresdefault

Surya 42 Movie: సినిమా సినిమాకి వైవిధ్య భరితమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వర్సటైల్ యాక్టర్ గా పేర్గాంచారు సూర్య. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తనదైన మార్క్ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అభిమానులతో పాటు జాతీయ అవార్డులను సొంతం చేసుకుని నటనలో తన సత్తా చాటుకున్నాడు సూర్య. ఇటీవల వచ్చిన విక్రమ్ సినిమా ఆఖర్లో రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియా లెవల్లో సెన్షేషన్ అయ్యారు. ఇప్పుడదే రోల్ తో ఏకంగా సొంత సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దాన్ని దేశంలోని 10భాషల్లో రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ లాంటి క్రియేటివ్ మేకర్ తోడవ్వడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

Read Also: Aquarium explodes : పేలిపోయిన ప్రపంచంలోని అతిపెద్ద అక్వేరియం

అయితే అంతకన్నా ముందే సూర్య తన 42వ చిత్రం ద్వారా ఏకంగా పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ వర్సటైల్ యాక్టర్ తన 42వ చిత్రం శివ దర్శతకత్వంలో చేస్తున్నారు. ఈ భారీ పిరియాడిక్ డ్రామాని రెండు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే గోవా..చెన్నై ల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. శుక్రవారం నుంచి మరో షెడ్యూల్ మొదలైంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా బాలీవుడ్ భామ దిశా పటానీ నటిస్తోంది. తాజా షెడ్యూల్‎లో దిశాపటానీ కూడా పాల్గొననున్నట్లు స్వయంగా ఆమె ఇన్ స్టా ద్వారా తెలిపింది. సూర్య సరసన తొలి చిత్రం కావడంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు ఇటీవలే దిశ ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ ఎగ్టైట్ మెంట్ కి నిన్నటి తో తెరపైడింది. ఇక ఈ చిత్రాన్ని 3డీ ఫార్మెట్ లో రిలీజ్ చేయనున్నారు. ఏకంగా పదిభాషల్లో ఒకేసారి చిత్రాన్ని ఈ ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నారు. పది భాషల్లో సూర్య చిత్రం రిలీజ్ కావడం కూడా ఇదే తొలిసారి

Exit mobile version