NTV Telugu Site icon

Upcoming 5G Smartphones: జూలైలో విడుదల కానున్న టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!

Samsung Galaxy M34 Oneplus Nord 3

Samsung Galaxy M34 Oneplus Nord 3

Upcoming 5G Smartphones 2023 July: 2023 జూలై నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. పలు 5G ఫోన్‌లు రిలీజ్ కావడానికి లైన్‌లో ఉన్నాయి. శాంసంగ్‌ గెలాక్సీ ఎం34 (Samsung Galaxy M34), నథింగ్‌ ఫోన్‌ 2 (Nothing Phone (2)), వన్‌ప్లస్ నార్డ్‌ 3 (OnePlus Nord 3), ఐకూ నియో 7 ప్రో ( iQoo Neo 7 Pro) మరియు రియల్‌మీ నార్జో 60 (Realme Narzo 60) వంటి ప్రముఖ ఫోన్‌లు త్వరలో భారత్‌లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌లు కొన్ని సామాన్యులకు కూడా అందుబాటులో ధరలో ఉండనున్నాయి. టాప్-ఎండ్ ఫీచర్‌లతో ఉన్న 5G స్మార్ట్‌ఫోన్‌లు గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు. ఈ ఫోన్లలో ప్రత్యేకత ఏంటో చూద్దాం.

Samsung Galaxy M34:
శాంసంగ్‌ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్‌లకు మంచి క్రేజ్ ఉంది. ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ మరియు 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుందని లీక్ సూచించింది. కంపెనీ 25W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇవ్వనుంది.

Nothing Phone (2):
నథింగ్ ఫోన్ (2) కొత్త 5G ఫోన్. ఇది క్వాల్‌కామ్‌ యొక్క టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా వస్తుంది. ఈ ఫోన్ 6.7-అంగుళాల స్క్రీన్, 4700mAh బ్యాటరీ మరియు కొత్త లైట్/సౌండ్ సిస్టమ్‌తో వెనుకవైపు భిన్నమైన డిజైన్‌తో వస్తుంది. నథింగ్ ఫోన్ (2)తో ఛార్జర్ రాదు. మూడేళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు మరియు నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లకు కంపెనీ మద్దతును కూడా ప్రకటిస్తోంది.

Also Read: IND vs PAK: 7 ఏళ్ల తర్వాత భారత్‌కు పాకిస్తాన్.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

OnePlus Nord 3:
వన్‌ప్లస్ నార్డ్‌ 3లో 1.5K రిజల్యూషన్ మరియు 120Hz డిస్‌ప్లే ఉండవచ్చు. ఇది దాదాపు 6.74 అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఇది అమోలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.దీనిని మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ద్వారా అందించవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ.30,000 కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా.

Realme Narzo 60 series:
1TB స్టోరేజ్‌తో నార్జో 60 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయాలని రియల్‌మీ యోచిస్తోందని సమాచారం. రియల్‌మీ ఇటీవల టీజర్‌లో కూడా ఇదే సూచించింది. ఈ ఫోన్‌లో వినియోగదారులు 2,50,000 కంటే ఎక్కువ ఫోటోలను సేవ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

iQOO Neo 7 Pro:
ఐకూ నియో 7 ప్రో 6.78-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ అవుతుంది. ప్యానెల్ బహుశా 120Hz రిఫ్రెష్ రేట్‌లో ఉండవచ్చు. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ Gen 1 చిప్‌సెట్ ఉండనుంది. ఇది ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ మరియు 2022కి చెందిన అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఉపయోగించబడుతోంది. ఈ ఫోన్ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. నియో 7 ప్రో ధర భారతదేశంలో రూ. 40,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా.

Also Read: CWC 2023: టీమిండియాకు కలిసిరాని రౌండ్ రాబిన్ ఫార్మాట్.. ఆందోళనలో ఫాన్స్!