NTV Telugu Site icon

UP T20 League 2024: ఛాంపియన్‌గా నిలిచిన రింకు సింగ్ జట్టు..

Up T20 League 2024

Up T20 League 2024

UP T20 League 2024: మీరట్ మావెరిక్స్ జట్టు కాన్పూర్ సూపర్ స్టార్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. మీరట్ జట్టు తొలిసారి ఈ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతను జట్టుకు నాయకత్వం వహించనప్పటికీ.. అతని జట్టు ఛాంపియన్‌గా ఘనత సాధించింది. దులీప్ ట్రోఫీలో పాల్గొనడం వల్ల రింకు సింగ్ ఫైనల్ మ్యాచ్ ఆడలేకపోయాడు, దీని కారణంగా మాధవ్ కౌశిక్‌కి మీరట్ మావెరిక్స్ కెప్టెన్సీని అప్పగించారు. మీరట్ గత సీజన్ అంటే 2023 ఫైనల్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. కానీ., ఈసారి జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. గత సీజన్‌లో కాశీ రుద్రరాజ్ మీరట్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి UP T20 లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది.

Sub-Registrar Office: సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి..

మీరట్ మావెరిక్స్ ఈ టైటిల్ విజయంలో కెప్టెన్ మాధవ్ కౌశిక్, 19 ఏళ్ల బ్యాట్స్‌మెన్ స్వస్తిక్ చికారా ముఖ్యమైన సహకారాన్ని అందించారు. కౌశిక్ సిక్సర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. మాధవ్ 43 బంతుల్లో (రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) అజేయంగా 69 పరుగులు చేయగా, స్వస్తిక్ చికారా 31 బంతుల్లో 62 పరుగులు (మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు)తో రాణించారు. ఐపీఎల్‌లో స్వస్తిక్ చికారా ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాన్పూర్ సూపర్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. కాన్పూర్ తరఫున కెప్టెన్ సమీర్ రిజ్వీ 36 బంతుల్లో 57 అత్యధిక పరుగులు చేశాడు. అతను కాకుండా, శౌర్య సింగ్ 23 బంతుల్లో 56 పరుగులు చేశాడు. మీరట్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన యశ్ గార్గ్ 3 వికెట్లు పడగొట్టాడు.

Balapur Laddu: బాలాపూర్ గణేష్ లడ్డు కొన్నాక దశ తిరిగింది.. ఈసారి కూడా రికార్డు సృష్టిస్తా..!

191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన మీరట్ మావెరిక్స్‌కు ఆరంభం సరిగా లేదు. ఆకాష్ దూబే కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత జట్టు కేవలం 40 పరుగులకే ఉవైష్ అహ్మద్ (13) వికెట్ కూడా కోల్పోయింది. అయితే దీని తర్వాత స్వస్తిక్ చికారా, మాధవ్ కౌశిక్ 66 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు.