NTV Telugu Site icon

Friendship: తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని.. వైద్యుడిపై కాల్పులు

Crime

Crime

Man Tries To Kill Chennai Doctor Over His Friendship With Girlfriend: తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్‌ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆదివారం కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడని.. ఈ కాల్పుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థి తృటిలో తప్పించుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. అదృష్టవశాత్తూ కాల్చిన షాట్ లక్ష్యం తప్పిపోగా.. డాక్టర్, ప్రజల సహాయంతో నేరస్థుడిని వెంటనే అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

Read Also: Fire Accident: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థులకు గాయాలు

26 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థి రోహన్ మద్రాస్ మెడికల్ కాలేజీ-రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ క్యాంపస్‌కు సమీపంలోని టీ దుకాణం సమీపంలో ఉన్నప్పుడు, అతనిని అనుసరించిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కాల్పులు జరిపారు. కుట్రదారుగా భావిస్తున్న మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రితిక్ కుమార్‌గా గుర్తించారు. తప్పించుకున్న వ్యక్తిని అమిత్‌ కుమార్‌గా గుర్తించారు. అతను కూడా అదే ఉత్తరాది రాష్ట్రానికి చెందినవాడు.

ప్రాథమిక విచారణ ప్రకారం.. అమిత్ కుమార్ ప్రియురాలు కూడా పీజీ మెడికల్ విద్యార్థిని. ఆమె అతనితో కొంతకాలం నుంచి మాట్లాడడం మానేసింది. ఈ క్రమంలో అమిత్‌ కుమార్‌ చాలా కోపంగా ఉన్నాడు. ఆమె మెడికల్ విద్యార్థి అయిన రోహన్‌తో స్నేహంగా ఉంటోంది. ఇది గమనించిన అమిత్‌.. అతడిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

Show comments