NTV Telugu Site icon

UP: ఝాన్సీ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు.. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు

Jhansi Hospital

Jhansi Hospital

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్‌ కాలేజీ చైల్డ్‌వార్డ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ బృందానికి డీజీఎంఈ నేతృత్వం వహిస్తారు.

Read Also: Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి భాజాలు.. అసలు నిజం ఇదే!

ఉత్తరప్రదేశ్‌ బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఒకటి. ఈ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)లో శుక్రవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో 10 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో మరో 16 మంది చిన్నారులు గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. మంటలు చెలరేగిన వార్డులో మొత్తం 55 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి పాలకవర్గం నిర్లక్ష్యం, ఆస్పత్రిలో ఉంచిన అగ్నిమాపక పరికరాలపై చర్చ సాగింది. ఆసుపత్రిలో మంటలను ఆర్పే పరికరాల గడువు ముగిసిందని.. అలారంలు తప్పుగా ఉన్నాయని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

Read Also: Health Benefits: ఈ జ్యూస్ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా

ఈ ఘటన అనంతరం.. యూపీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ‘యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పిల్లలు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది. మా సిబ్బంది, వైద్యులు మరియు రెస్క్యూ బృందాలు పిల్లలను రక్షించడానికి ధైర్యంగా పనిచేశాయి. వైద్య కళాశాలలో అగ్నిమాపక పరికరాలన్నీ బాగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. జూన్‌లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.’ అని పేర్కొన్నారు.