UP Family Suicide: జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ అప్పులు చేస్తూనే ఉంటారు. ఎంత అప్పు చేస్తున్నారనేది వారివారి అవసరాలు, తీర్చగల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సార్లు కొందరు వారి అవసరం కారణంగా శక్తికి మించిన అప్పులు చేసి అనేక అవస్థలు పడుతుంటారు. పరిస్థితులు ఏమాత్రం చేదాటిపోతున్నట్లు అనిపించినా వాళ్లు ఆ అప్పుల భారాన్ని మోయలేక ప్రాణాలను తృణప్రాయంగా త్యజిస్తున్నారు. పాపం వాళ్లు మాత్రమే కాకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకు, బిడ్డలను కూడా కడతేర్చుతున్నారు. అచ్చంగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. ఓ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం కడతేర్చింది. కన్నకొడుక్కి విషం పెట్టి చంపి, భార్యాభర్తలు ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది.
READ ALSO: Kamareddy : కామారెడ్డిలో భారీ వర్షాలు.. రైళ్ల రాకపోకలు రద్దు..
భార్య, కొడుకుతో సహా ఆత్మహత్య..
షాజహాన్‌పూర్ జిల్లా థానా రోజా పరిధిలో నివసిస్తున్న చేనేత వ్యాపారి సచిన్ గ్రోవర్ (30), అతని భార్య శివాని(28), వారి కుమారుడు ఫతే (4) మృతదేహాలు వారి ఇంట్లో కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ.. దంపతులు వేర్వేరు గదుల్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించారని, వారి కుమారుడు ఫతే మృతదేహం మరో గదిలో ఉందని పేర్కొన్నారు. ఈ దంపతులు వారి నాలుగేళ్ల కుమారుడికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించారని, ఆ తర్వాత వాళ్లు వేర్వేరు గదుల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మృతుడి కుటుంబం ఇంటి రెండవ అంతస్తులో నివసిస్తుండగా, మిగిలిన కుటుంబసభ్యులు కింద ఉంటున్నారని తెలిపారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మృతుడి తల్లి సచిన్ గ్రోవర్ మాట్లాడుతూ.. సచిన్ నిన్న సాయంత్రం తనతో రూ.ఐదు లక్షల బ్యాంకులో డిపాజిట్ చేయాలని చెప్పాడని, రూ.మూడు లక్షల ఏర్పాటు చేశానని చెప్పారు. ఇప్పుడు తన కొడుకు, కోడలు, మనవడు మృతదేహాలుగా మారారని కన్నీటిపర్యంతం అయ్యారు. సంఘటన స్థలం నుంచి పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో మృతుడు తాను చాలా బాధపడ్డానని, చాలా అప్పులు చేశానని రాశాడు. తాను వేర్వేరు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకున్నానని, ఆదాయం లేకపోవడంతో మానసికంగా చాలా బాధలో ఉన్నానని చెప్పాడు. “నా కుటుంబ సభ్యులపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. అందరూ నాకు మద్దతు ఇచ్చారు. మా కారు, ఇల్లు మొదలైన వాటిని అమ్మి అప్పు తీర్చండి, దీంతో ఇంకా తమ అప్పు పెండింగ్‌లో ఉందని ఎవరూ చెప్పలేరు.” అని సూసైడ్ నోట్‌తో పేర్కొన్నారు.
READ ALSO: Inga Ruzeniene: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూరప్ దేశం.. కొత్త ప్రధానికి 44 ఏళ్లు..