SP – Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SP – Congress Alliance: మరోసారి అధికారం చేపట్టాలని యోగి ఆదిత్యానాథ్.. ఎలాగైనా యోగిని గద్దె దింపాలని ఎస్పీ-కాంగ్రెస్ ప్లాన్.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2027 నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు వేగం పుంజుకున్నాయి. సీట్ల పంపకాలపై రెండు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు 26 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని ఎస్పీ ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.. అయితే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్కు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..
26 స్థానాలతో ఎస్పీ ప్రతిపాదన
సోమవారం రోజు ఎస్పీ, కాంగ్రెస్ నేతల మధ్య తొలి సమావేశం జరిగింది. సుమారు 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీతో సీట్ల పంపకాల చర్చలకు ఊపొచ్చింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రాంపూర్ ఖాస్, ఫరెండా స్థానాలతో పాటు రెండో స్థానంలో నిలిచిన మథుర, ఖేరాగఢ్, జగదీశ్పూర్, కిద్వాయ్ నగర్ నియోజకవర్గాలను కూడా ప్రతిపాదిత జాబితాలో చేర్చినట్లు సమాచారం. మిగిలిన 20 స్థానాలు ఉత్తరప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్ ఈ చర్చలపై స్పందించారు. సమావేశంలో చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పామని, కాంగ్రెస్కు తమ 26 స్థానాలను ఇచ్చామని పేర్కొన్నారు. మంగళవారం కూడా మరోసారి చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. చర్చలు ముందుకు సాగుతున్న కొద్దీ కాంగ్రెస్కు కేటాయించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Sonia Gandhi: 'నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు'.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
- PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- Legal Notice to Sonia Gandhi: సోనియా గాంధీ పుస్తకంపై మరో వివాదం.. సావర్కర్ మునిమనవడి సంచలన నిర్ణయం!
- Loyal Stray Dog: కన్నీళ్లు పెట్టిస్తున్న వీధి కుక్క విశ్వాసం.. అన్నం పెట్టిన వ్యక్తి అంత్యక్రియల కోసం శ్మశానం వరకు శునకం!
120 స్థానాలతో కాంగ్రెస్ జాబితా
మరోవైపు కాంగ్రెస్ పార్టీ 120 అసెంబ్లీ నియోజకవర్గాలతో కూడిన జాబితాను ఎస్పీకి అందించినట్లు సమాచారం. ఈ జాబితాను మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలుస్తోంది. కేటగిరీ-ఏలో 55 స్థానాలను చేర్చారు. వీటిలో కాంగ్రెస్ గట్టిగా పోటీ చేయాలని భావిస్తోంది. కేటగిరీ-బీలో గతంలో మంచి ఫలితాలు సాధించిన నియోజకవర్గాలు ఉండగా, కేటగిరీ-సీలో గెలుపు అవకాశాలు ఉన్న స్థానాలను చేర్చినట్లు సమాచారం. ఈ జాబితాపై ఎస్పీతో చర్చలు జరగనున్నాయి.
181 స్థానాలపై కూడా కాంగ్రెస్ కన్ను
ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ 181 అసెంబ్లీ స్థానాల పేర్లను సీట్ల పంపకాల పరిశీలన కోసం ఎస్పీకి అందించినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో 135 జనరల్ స్థానాలు, 45 ఎస్సీ రిజర్వుడు స్థానాలు, ఒక ఎస్టీ రిజర్వుడు స్థానం ఉన్నాయి. సీట్ల పంపకాల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ, అన్ని స్థానాలను ఎస్పీ కేటాయించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
60 నుంచి 70 సీట్లకే ఎస్పీ మొగ్గు?
కాంగ్రెస్కు 60 నుంచి 70 స్థానాలు కేటాయిస్తే సరిపోతుందని పలువురు ఎస్పీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మిగిలిన స్థానాల్లో అత్యధికంగా పోటీ చేసి అసెంబ్లీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 26 స్థానాల ప్రతిపాదనతో ప్రారంభమైన చర్చలు ఎక్కడ ముగుస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు, సీట్ల సర్దుబాటుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.
తాజావార్తలు
-
SP – Congress Alliance: కాంగ్రెస్ ఆశలకు ఎస్పీ బ్రేక్ వేయనుందా..? తెరపైకి 26 సీట్ల ఫార్ములా..!
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. కోటి మంది మహిళలకు కోటి చీరలు.. ఎవరు అర్హులు?
-
Kishan Reddy: దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ డ్రగ్స్.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
Sonia Gandhi: ‘నాన్నను చంపించడానికే భద్రత తొలగించారు’.. రాజీవ్ గాంధీ హత్యపై సోనియా సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!