Site icon NTV Telugu

Yogi Adityanath: అయోధ్యకు పూర్వ వైభవం వచ్చింది..

Yogi

Yogi

500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.

Read Also: Ayodhya Ram Temple: 500 ఏళ్ల చరిత్ర.. 1528 నుంచి 2024 వరకు అయోధ్య రామ మందిరంలో కీలక ఘట్టాలు తెలుసుకోండి..

అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టి, అంకిత భావంతో ఇదంతా సాధ్యమైందన్నారు. అయోధ్యకు పూర్వవైభవం తెచ్చేందుకు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. తన ఆలయం కోసం సాక్షాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట రామ రాజ్యాన్ని సాకారం చేస్తుందని తెలిపారు. రాముడు మనకు ఎంతో ఓర్పును నేర్పించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Read Also: Ayodhya : అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన తేదీ వచ్చేసింది.. ప్రకటించిన ముస్లిం పక్షం

Exit mobile version