NTV Telugu Site icon

Yogi Adityanath: అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలి.. వేములవాడ ప్రజలకు పిలుపు

Yogi Aditya Nath

Yogi Aditya Nath

అయోధ్య రామ మందిరం ప్రారంభానికి అందరూ రావాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వేములవాడ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే జనవరిలో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నామని, దానికి మీరంత రావాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం ఉమ్మడి కరీంనగర్ రాజన్న సిరిసిల్లాలో బీజేపీ అభ్యర్థి వికాస్ రావు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు యోగి ఆదిత్య బహిరంగ సభలో ప్రసంగించారు.

‘టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో జతకట్టి ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. అధికార పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటుంది. తెలంగాణ ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తూ, ముస్లింలతో జతకట్టి మోసం చేస్తుంది. గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం పేరిట పార్టీలు మోసం చేశాయని నీళ్లు, నిధులు నియామకాలు నినాదంతో అధికారంలోకి ప్రజలను మోసం చేసింది. బీఆర్ఎస్ అంటే బ్రస్టా చార్ పార్టీ. ఉత్తరప్రదేశ్‌లో ఆరు సంవత్సరాల క్రితం రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. ఆ తర్వాత యూపీలో డబల్ ఇంజన్ సర్కార్‌తో ముందుకు వెళ్తున్నాం.

లక్షల మంది నిరోద్యోగులకు ఉద్యోగాలు కల్పించాం. డబల్ ఇంజన్ సర్కార్ అంటే డబల్ స్పీడ్‌తో వెళ్లే ప్రభుత్వo.
ప్రధానమంత్రి మోడీ నేతృతంలో దేశంలో అందరూ తలెత్తుకునేలా చేసాడని, నయా భారత్ నరేంద్ర మోడీ నాయకత్వంలో ముందుకెళ్తున్నారు. రతదేశంలో అన్ని రంగాల్లో శరవేగంగా ముందుకెళ్తున్నామని అది నరేంద్ర మోడీతోనే సాధ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదని, బీజేపీ రైతుల కోసం సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఎజెండా ఒక్కటే.

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారి ప్రజలను మోసం చేసింది. గత పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. వేములవాడ వికాసం కోసం గెలిపించాలి ఈసారి వికాస్ రావుకు అవకాశం ఇవ్వండి. కేంద్ర మాజీ మంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు తెలంగాణ వేములవాడలో పోటీ చేస్తున్నాడు. వికాస్ రావును గెలిపించండి’ అని యోగి ఆదిత్యనాథ్ విజ్ఒప్తి చేశారు.