Uorfi Javed Death Threat: సోషల్ మీడియా స్టార్ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అసాధారణ స్టైల్ కారణంగా నిత్యం వార్తల ముఖ్యాంశాల్లో ఉంటుంది. ఉర్ఫీ అలాంటి లుక్లో కనిపించిన ప్రతిసారీ అందరూ షాక్ అవుతారు లేదా తల పట్టుకుంటారు. ఈసారి ఉర్ఫీ భూల్ భులయ్యా నుండి ఛోటా పండిట్ క్యారెక్టర్ ను కాపీ కొట్టింది. ఇది ఆమెకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఆమెను చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఉర్ఫీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఉర్ఫీ ఇటీవల భూల్ భులయ్యా నుండి ఛోటా పండిట్ వేషం వేసుకుని… సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను అప్ లోడ్ చేసింది. ఈ లుక్లో ఆమె హాలోవీన్ పార్టీకి వెళుతోంది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఉర్ఫీకి మెయిల్లో హత్య బెదిరింపులు పంపించారు.
Read Also:Pydithalli Sirimanotsavam: నేడు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. పోటెత్తిన భక్తులు
I’m just shocked and appalled by this country mahn , I’m getting death threats in recreating a character from a movie where as that character didn’t get any backlash :/ pic.twitter.com/pOl9FvTYzT
— Uorfi (@uorfi_) October 30, 2023
Read Also:MLC Kavitha: తెలంగాణ మోడల్ పై ఎమ్మెల్సీ కవిత కామెంట్
ఆమె లుక్, మెయిల్ ఫోటోలను ఉర్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తను ఇలా.. నేను షాక్ అయ్యాను, ఒక చిత్రం పాత్రను ధరించినందుకు నన్ను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వ్యక్తి ఉర్ఫీకి మెయిల్ పంపి చంపేస్తానని బెదిరించాడు. మీరు అప్లోడ్ చేసిన వీడియోను తొలగించండి, లేకపోతే మిమ్మల్ని చంపడానికి సమయం పట్టదు. మరొక వ్యక్తి.. ఉర్ఫీ జావేద్ మన హిందూ మతాన్ని కించపరుస్తున్నాడని కామెంట్స్ చేశాడు.